మహబూబ్‌నగర్

ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో జాప్యాన్ని సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 16: పూర్వపు మహబూబ్‌నగర్‌లోని తుమ్మిళ్ల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ప్రాజెక్టు పనులకు నిధులు ఎప్పటికకప్పుడు విడుదల చేస్తామని, పనుల్లో ఏ మాత్రం జాప్యాన్ని స హించేదిలేదని రాష్ట్ర భారీ నిటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరిశ్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో పూర్వపు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరిశ్‌రావు సమిక్ష నిర్వహించారు. సందర్భంగా మంత్రి హరిశ్‌రావు మాట్లాడుతూ తు మ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై మంత్రి ముందుగా సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని సర్వీస్‌బే కంట్రోల్ పనులు వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించా రు. ప్రేషర్‌మైన్స్ పనులు జాగ్రత్తగా చేయాలని ఎక్కడలీకులు లేకుండా చూసుకోవాలని అన్నారు. ఈడీడీ క్రేన్ నిర్మించేలోగా మోబైల్ క్రేన్ ద్వారా మోటార్లు బి గించే పనులు చేయాలన్నారు. ఆగస్టు 31లోగా ఒక పంప్‌ను రన్ చేసేలా పనులు వేగవంతం చేయాలని మంత్రి ఇంజనీయర్లను ఆదేశించారు. అనంతరం నె ట్టెంపాడు ప్రాజెక్టు పనులపై సమిక్ష జరిపారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో 300 ఎకరాల వరకు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 200 ఎకరాల వరకు భూసేకరణ జరపాల్సి ఉందని మంత్రికి ప్రాజెక్టు ఇంజనీయర్లు తెలపగా అప్పటికప్పుడే మంత్రి హరిశ్‌రావు జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో పోన్ మాట్లాడారు. మంగళవారం సమావేశం నిర్వహించి భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశానికి ప్రా జెక్టు ఇంజనీయర్లు, రెవెన్యూ అధికారులు పాల్గొంటారని సిఇ ఎస్‌ఇలు హాజరై భూసేకరణ వేగంగా జరిగేలా చూడాలన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను ఫ్యాకేజీల వారిగా ఆయన సమిక్షించారు. ఈ ఫ్యాకేజీలోని సంగాల రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలన్నారు. రిజర్వాయర్ రివిట్‌మెంట్ పనులు నాణ్యతతో ఉండేలా చూడాలన్నారు. 102 ఫ్యాకేజీల్లో ప్రాధాన కాల్వల్లోని స్ట్రక్చర్ల పనులు ఫిల్డ్ చానల్స్ పనులు పూర్తి అయ్యోలా చూడాలన్నారు. 105 ఫ్యాకేజీల్లో ఫిల్డ్ చానల్స్ కోసం అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలన్నారు. పీల్డ్ చానల్స్ తవ్వే విషయంలో గ్రామస్తులు సహకరించడంలేదని ఇంజనీయర్లు మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే జిల్లా కలెక్టర్లు రైతు సమన్వయ సమితి సభ్యులు వ్యవసాయ రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఫీల్డ్ చానల్స్ పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చేలా చూడాలన్నారు. ఫ్యాకేజీ 107లో భూసేకరణ పూర్తి అయిన చోటా అన్ని స్ట్రక్చర్లు పూర్తి చేసిన్నట్లు అధికారులు వివరించారు. అదేవిధంగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చిన వెంటనే కల్వకుర్తి మోటార్లను ఆన్ చేయాలని అన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని ఫ్యాకేజీ 28లో 30 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టి తీసుకోచ్చారు. భూసేకరణ పూర్తి చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ ఫ్యాకేజీ పరిధిలోని ఫిల్డ్‌చానల్స్‌ను వేగంగా పూర్తి చేయాలని ఇంజనీయర్లుకు సూచించారు. ఫ్యాకేజీ 30లో పెండింగ్‌లో ఉన్న స్ట్రక్చర్లు పీల్డ్ చానల్స్‌ను పూర్తి చేయాలని అన్నారు. తుంగ్రభద్ర నది నుండి నీరు వచ్చే అవకాశం ఉండడంతో కార్మికులను పెంచి రాత్రింబవళ్లు ప్రాజెక్టుల పనులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టు గ్రావీటి కెనాల్స్‌లను స్వయంగా పరిశీలించాలని సిఈ ఖగేందర్‌ను మంత్రి హరిశ్‌రావు ఆదేశించారు. ఆల్మట్టి, తుంగభద్రల నుండి నీరు శ్రీశైలం జలాశయంకు వచ్చిన చేరిన వెంటనే కల్వకుర్తి మోటర్ ఆన్ చేయాలని అధికారులను మంత్రి ఇంజనీయర్లను ఆదేశించారు.