మహబూబ్‌నగర్

సంక్షేమ పథకాల్లో ఎస్సీలను విస్మరించరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 14: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఎస్సీలను ఎక్కడ కూడా విస్మరించరాదని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రాములు అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలు అవుతున్న పలు సంక్షేమ పథకాల అమలులో ఎస్సీల వాటాపై జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ జాతీయ కమిషన్ సభ్యులుకు వివరించారు. అంతేకాకుండా జిల్లా ఎస్పీ అనురాథ సైతం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసీటి కేసుల విషయంపై కూడా నివేధికను అందజేశారు. పలు కేసుల పురోగతిని వివరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో రాములు మాట్లాడుతూ ఎస్సీల వాటా తప్పకుండా అన్ని పథకాల్లో ఉండాల్సిందేనని తెలిపారు. కొన్ని నియోజకవర్గంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో ఎస్సీలకు ఎందుకు కేటాయించడంలేదని లబ్దిదారులకు ఇళ్లు తప్పకుండా ఇవ్వాల్సిందేనని అన్నారు. సబ్సీడీ రుణాల విషయంలో కూడా జిల్లాలో ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదు రాకుండా అధికారులు చూసుకోవాలని నిజమైన లబ్దిదారుడికి అన్యాయం మాత్రం జరగకూడదని అన్నారు.
కులమతాలకు అతీతంగా
రెండు పడకల ఇళ్లు ఇవ్వాలి
మూసాపేట: ప్రభుత్వం మంజూరుచేస్తున్న రెండు పడకల ఇళ్లను కులమతాలకు అతీతంగా ప్రభుత్వ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంజూరు చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు అధికారులకు అదేశించారు. మండల పరిధిలోని నిజాలాపూర్ గ్రామాన్ని మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో మంజూరైన రెండు పడకల ఇళ్లను దళితులకు ఎందుకు మంజూరు చేయలేదని తహశీల్దార్‌ను అడిగారు. అనంతరం ఎస్సీ యువకులు తమకు రుణాలు సక్రమంగా అందడం లేదని తెల్పడంతో ఎస్సీ కార్పొరేషన్ ఏఓను ఎందుకు రుణాలు మంజూరు చేయడం లేదని నిలదీశారు. తప్పనిసరిగా చదువుకున్న యువతకు రుణాలు మంజూరు చేయాలని వారికి ఉపాధి అవకాశాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. అంగన్‌వాడి సెంటర్లలో ఎంతమంది చిన్నారులు ఉన్నారని అంగన్‌వాడి టీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండవ విడతలో మంజూరైన రెండు పడకల గదులలో ఎస్సీలకు 18ఇళ్లను కేటాయించాలని అధికారులకు తెలిపారు. వెంటనే స్పందించిన ఆర్డీఓ కలెక్టర్‌తో మాట్లాడి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎస్సీ సభ్యుడికి ఇళ్లు మంజూరు చేయిస్తామన్నారు. మూడు రోజుల్లో సర్వే చేసి అర్హులైన వారి నివేదిక సమర్పించాలని తహశీల్దార్‌కు తెలిపారు. మాజీ సర్పంచ్ ఇంద్రయ్యసాగర్ మాట్లాడుతూ నిజాలాపూర్ గ్రామంలో ప్రభుత్వ స్థలం లేనందు వల్ల ఈ సమస్య ఏర్పడిందని ఉన్న సొంత స్థలంలో రెండు పడకల గదులను నిర్మించుకునే విధంగా కలెక్టర్‌తో మాట్లాడి అనుమతులు ఇప్పించాలని ఎస్సీ కమిషన్ సభ్యుడు, అర్డ్డీఓకు విన్నవించారు.

ప్రతి ఒక్కరూ 10 మొక్కలను దత్తత తీసుకొని పెంచాలి
* రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కల్వకుర్తి, అగస్టు 14: హరితహారంలో భాగంగా నాటే చెట్లు భావి తరాలకు పచ్చని వాతావరణం అందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హరితహారం నాలుగవ విడుత మొక్కల నాటే కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ తాండ నూతన గ్రామ పంచాయతీలో మంగళవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి వివిధ మొక్కలను మంత్రి జూపల్లి నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు 10 మొక్కలను దత్తత తీసుకొని పెంచాలని మంత్రి సూచించారు. కేసీఆర్ కుల మతాలకు అతీతంగా ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. మహిళ సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు విధిగా మొక్కలు నాటాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కొనసాగుతుందని, గ్రామ స్వరాజ్య స్థాపనే ధ్యేయంగా 500 కుటుంబాలకు మించిన జనాభా గల హాబిటేషన్లతో పాటు తాండలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీ ఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ అన్నారు. ఈ సమావేశంలో టీ ఆర్ ఎస్ నాయకులు, తాండ వాసులు తదితరులు పాల్గొన్నారు.