మహబూబ్‌నగర్

మాజీ ప్రధాని వాజపేయ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 16: భారతదేశ మాజీ ప్రధానీ అటల్ బిహారి వాజపేయ మృతిపట్ల జిల్లా ప్రజలు తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారు. గురువారం సాయంత్రం 5.5నిమిషాలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వాజపేయ కన్నుమూశారని వార్త తెలియగానే జిల్లాలోని ఆయన అభిమానులు, బీజేపీ నేతలు మాజీ జనసంఘ్‌నేతలు తీవ్ర దిగ్భ్రంతికి గురయ్యారు. వాజపేయ జిల్లాలో పర్యటించిన పాతజ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొందరు నేతలు తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. 1972లో జనసంఘ్ జాతీయ అధ్యక్షుడిగా అటల్ బిహారి వాజపేయ మహబూబ్‌నగర్‌లో పర్యటించారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో జనసంఘ్ అభ్యర్థి కోయిలకోండ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎస్ రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిమిత్తం మహబూబ్‌నగర్ టౌన్‌హల్‌లో జరిగిన బహిరంగసభకు వాజపేయ హాజరయ్యారు. అదేవిధంగా జనసంఘ్‌ను జనతాపార్టీలో విలీనం చేసిన తర్వాత ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికల సమయంలో 1977లో మరోసారి ఎస్. రాజేశ్వర్‌రెడ్డి ఇక్కడ అభ్యర్థిగా నిలబడడంతో ఆయన గెలుపుకోసం వాజపేయ మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం విచ్చేశారు. అయితే అప్పట్లో రాజేశ్వర్‌రెడ్డి కేవలం 2500 ఓట్లతో ఓటమి చెందితే ఓటమికి గురైన తన పార్టీ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డిని పిలిపించుకుని ధైర్యాన్ని నూరబోసి మానసికంగా మనమే గెలిచామని భవిష్యత్తు భారతదేశంలో మనదే ఉంటుందని అప్పట్లోనే జిల్లా నేతలతో వాజపేయ నేతలతో అన్నట్లుగా ప్రస్తుత బీజేపీ సీనియర్‌నేతలు చెబుతున్నారు. అదేవిధంగా నారాయణపేట మున్సిపల్ చైర్మన్ దివంగత గడ్డం సాయిబన్న సతీమణి సరోజ బ్రెయిన్‌ట్యూమర్ రావడంతో ఆమెను ఢిల్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం బీజేపీ సీనియర్‌నేతగా ఉన్న నాగురావు నామాజీ అప్పట్లో బీజేపీ యువమోర్చ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉండడం ఆయన నేరుగా 1988లో వాజ్‌పాయిని కలిసి సరోజ పరిస్థితిని వివరించి రక్తం కావాలని చెప్పగా తానే రక్తం ఇస్తానని ఆసుపత్రి వరకు కాలినడకన వాజపేయ వచ్చారని నాగురావు నామాజీ ఈ సందర్భంగాపాతజ్ఞాపకాలను గుర్తు చేసుకుని తీవ్రదిగ్బ్రాంతికి గురయ్యారు. అదేవిధంగా దివంగత ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి, నాగురావునామాజీలు వాజ్‌పాయితో కలిసి జమ్మూ కాశ్వీర్‌లో ఓ ఉద్యమంలో పాల్గొన్నారు. హిందువుల ఊచకోతకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న వాజపేయిని, జిల్లా నేతలు రాజేశ్వర్‌రెడ్డి, నాగురావులను దొడ జిల్లాలోని మిలటరి జైలులో ఉంచారు. ఈ జైలులో ఒకే దగ్గర మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాయకులు వాజ్‌పాయితో కలిసి దాదాపు 20రోజుల పాటు ఉండడంతో ఇలాంటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని జిల్లా నేతలు వాజపేయ మృతి పట్ల తీవ్రసంతాపాన్ని తెలియజేశారు. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన జన్‌సంఘ్‌నేత సాయన్న వాజపేయతో ఉన్న సంబంధాలు పాత జ్ఖాపకాలను గుర్తు చేసుకుంటూ తమ సంతాపాన్ని తెలియజేశారు. అటల్ బిహారి వాజపేయ మృతి పట్ల బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి తీవ్ర సంతాపాన్ని తెలిజేశారు. మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి వాజ్‌పాయి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తాను వాజపేయ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తొలిసారిగా తాను పార్లమెంట్‌కు వెళ్లానని ఆయన తనపై చూపించిన అభిమానం ఇప్పటికి గుర్తుకు వస్తుంటాయని అలాంటి నాయకులు ప్రపంచంలోనే తక్కువమంది ఉంటారని ఆయన జీవితమే దేశం కోసమని అన్నారు. ఆయన ప్రసంగాలను తాను ప్రత్యేకంగా విన్నానని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పటికీ విలువలతో కూడిన రాజకీయాలు చేయటం జరుగుతుందని అన్నారు. ఆయన మృతి దేశానికి తీరనిలోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తండ్రి రాజేశ్వరెడ్డితో వాజ్‌పాయికి ఉన్న సంబందాలను చాలా మంది నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుని తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.