మహబూబ్‌నగర్

వరుణుడి కరుణతో అన్నదాతల్లో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, ఆగస్టు 16: వరుణ దేవుడు కరుణించడంతో ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే కురిసి చెరువులు, కుంటలు అలుగులు పారుతుండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని సింగోటం గ్రామంలో ఎంజీ ఎల్ ఐ మొదటి రిజర్వాయర్ అయిన సింగోటం శ్రీవారి సముద్రం(చెరువు) కింద రైతులు తమ పొలాలలో వరి నాటు వేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నాట్లు వేస్తున్న రైతు కూలీల దగ్గరకి వెళ్లి కూలీ ఎంత ఇస్తున్నారు, మెట్ట పంటలు ఎలాగున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, కూలీలు మాట్లాడుతూ ఈ సంవత్సరం ముందుగానే వర్షాలు ప్రారంభమయ్యాయని ఎంజీ ఎల్ ఐ ఎత్తిపోతల పథకం ద్వారా సింగోటం శ్రీవారి సముద్రం పూర్తి స్థాయిలో నిండిందని ఖరీఫ్ సీజన్‌లో ఈ మధ్యకాలంలో ఇంత త్వరగా వరి నాట్లు వేయడం మొదటి సారి అని తెలిపారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీ ఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారని, ఆ డబ్బులను వ్యవసాయ పనుల కోసం వినియోగించుకుంటే ఎవరు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదని అన్నారు. వరుణ దేవుడు కరుణిచండంతో పాటు ముఖ్యమంత్రి కేసీ ఆర్ కూడా రైతులకు పెద్దపీఠ వేస్తూ రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అనంతరం సింగోటం శ్రీవారి సముద్రం కట్టపై జరుగుతున్న టూరిజం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో సోమశీలతో పాటు సింగోటం కూడా టూరిజం కేంద్రంగా విరజిల్లుతుందని అన్నారు. ఆయన వెంట ఎంపీపీ నిరంజన్‌రావు, జడ్పీటీసీ హన్మంత్ నాయక్, టీ ఆర్ ఎస్ నాయకులు నర్సింహ్మరావు, మహేష్, సత్యనారాయణ పాల్గొన్నారు.

కేఎల్‌ఐ కాల్వ గండి వెంటనే పూడ్చి..సాగునీరు అందించండి
* మంత్రి జూపల్లి
పాన్‌గల్, ఆగస్టు16: పాన్‌గల్ మండల పరిధిలోని కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి గ్రామాల మధ్య బొల్లిగట్టు వద్ద కేఎల్ ఐ కాల్వకు గండిని గురువారం పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కేఎల్‌ఐ కాల్వకు గండి పడి బీమా కాల్వలోకి సాగునీరు ప్రవాహిస్తుండడంతో సాగునీరు కె ఎల్ ఐ కాల్వ ముందు ప్రాంతాలకు సాగునీరు వెళ్లడంలేదు. దీంతో మంత్రి జూపల్లి కె ఎల్ ఐ కాల్వకు గండి పడిన ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే మరమ్మత్తులు చేపట్టి సాగునీరు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి చెరువులు, కుంటలను నీటితో నింపి రైతులకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. మంత్రి వెంట ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జడ్డీటీ రవికుమార్ , విండో వైస్ చైర్మన్ భాస్కర్‌యాదవ్, టీ ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గోవర్దన్‌సాగర్, నాయకులు రాంచందర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.