క్రైమ్/లీగల్

అనుమానాస్పద స్థితిలో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గట్టు, ఆగస్టు 21: మండల పరిధిలోని బల్గెర గ్రామానికి చెందిన బోయ గిరప్పగాళ్ల ఎల్లప్ప (52) సోమవారం రాత్రి అనుమానస్పదంగా పొలంలో మృతి చెందారు. గట్టు మండల పరిధిలోని బల్గెర గ్రామానికి చెందిన ఎల్లప్పకు 3 ఎకరాల భూమి ఉంది. సోమవారం రాత్రి తన పొలానికి వెళ్లిన ఎల్లప్ప అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని ఉదయం చుట్టు పక్కన రైతులు, వారి బందువులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న గట్టు పోలీసులు అందించిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ సురేందర్‌రావు ఆధ్వర్యంలో మృతదేహాన్ని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో పరిశీలించి, గ్రామస్థులను విచారించారు. గ్రామస్థుల కథనం మేరకు భూ పంచాయతీ వల్లనే హత్య జరిగి ఉంటుందని కొందరు చెప్పగా, మరికొందరు గ్రామ రాజకీయాలే ముఖ్య కారణమని పోలీసులకు సమాచారం అందించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
కక్షలు పునావృతమవుత న్నాయా!
గతంలో బల్గెర గ్రామం ఫ్యాక్షనిస్టు గ్రామంగా ఉండి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి గ్రామంలో ఉండకుండా వలసల బాటలు పట్టి, ఇప్పుడిప్పుడే గ్రామంలో ప్రశాంతంగా కక్షలు మరిచి ఒక్కరినొక్కరు బంధుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఇటీ వల రాజకీయ పార్టీలో చేర్పులు, మార్పుల వల్ల గ్రూపు రాజకీయాల మద్య అనుమాన స్థితిలో బలమైన వర్గానికి చెందిన ఎల్లప్ప హత్య కావడంతో గ్రామంలో అన్ని వర్గాలలో భయాందోళనలు నెలకొన్నాయ. బల్గెర గ్రామంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనని, మళ్లీ కక్షలు పునరావృత్తం అవుతాయోనని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
బల్గెర గ్రామంలో ఎల్లప్ప అనుమానాస్పదంగా మృతి చెందడంతో మంగళవారం ఉదయం జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సంఘట స్థలానికి చేరుకొని పరిశీలించారు. గద్వాల డీఎస్పీ సురేందర్‌రావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు విజయ్‌కుమార్, ఓబుల్‌రెడ్డి, నాయకులు గట్టు తిమ్మప్ప, నారాయణరెడ్డి, బాసు హన్మంతు, తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్ సంఘట స్థలం వద్ద, పొలాల వద్ద తిరిగినట్టు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బంధోబస్తు నిర్వహిస్తున్నారు.

మిద్దె కూలి వీఆర్‌ఏ మృతి
నర్వ, ఆగస్టు21: నర్వ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున తన స్వంత ఇల్లును శుభ్రం చేస్తుండగా ఒక్కసారి మట్టిమిద్దె కూలి కావలి ఎల్లమ్మ (55) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కావలి ఎల్లమ్మ గ్రామంలో వీ ఆర్ ఏగా తహశీల్దార్ కార్యాలయంలో విధులు కొనసాగిస్తుంది. ఇంట్లో తన మనువడితో పాటు నివాసిస్తుండగా ఉదయం పూట ఇల్లును శుభ్రం చేస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా ఆమెపై ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న మనువడు అది గమనించి మా అవ్వపై ఇల్లు కూలిందని కేకలు వేయడంతో చుట్టు ప్రక్కల వారు అక్కడికి చెరుకొని మట్టిని ఎలికి తీయగా మట్టి కింద శవమై కనిపించింది. ఇట్టి సంఘటన చూసి గ్రామస్థులు తీవ్ర ద్రిగ్బాంతికి గురయ్యారు. మృతురాలికి ముగ్గురు కుమార్తెలకు సమాచారం చేరడంతో వారు శవం వద్ద బోరున విలపించారు. మండల రెవెన్యూ తహశీల్దార్ రాంకోటి, డిటి వాసుదేవరాజు, ఆర్ ఐ విజయ్‌కుమార్, వీ ఆర్వోలు రషిద్‌లు,బీమయ్య, విష్ణు, శివకుమార్ శవం దగ్గర వౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి దాన సంస్కరణాల నిమిత్తం రూ.5వేలు నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అదుకుంటామని హమి ఇచ్చారు. గ్రామంలో ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు చలించి పోయ్యారు. గత మూడు రోజుల పాటు కురిసిన ముసురు వర్షానికి ఇల్లు పూర్తిగా నాని ఇంటి ముందు వున్న హల్ కూలడంతోనే ఈ సంఘటన సంబవించిందని పలవురు అన్నారు.

వర్షానికి కూలిన మట్టిల్లు.. తృటిలో తప్పిన ప్రమాదం
ధన్వాడ: మరికల్ మండల కేంద్రంలో గత మూడు రోజులుగా కూరుస్తు వర్షంకు మంగళవారం మరికల్ గ్రామాన్నికి చెందిన కుర్వ గౌడప్పల బీరప్పకు సందించిన మట్టి ఇల్లు కూలిపోయింది. మంగళవారం ఇంటిలోనుండి తాగునీళ్ల కోసం బయాటకు రావడంతో ప్రమాదం తప్పిందని బాదితులు తెలిపారు. వర్షనికి కూలీన ఇంటిని మరికల్ గ్రామ ఎంపిటీసీ కస్పే సౌభాగ్యలక్ష్మీ,నాయకులు కె.శ్రీనివాసులు,గోపి,మాజి వార్డుసభ్యులు అరుణలు పరిశీలించారు. బాదితులకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం డబూల్‌బేడ్ రూంను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.అనంతరం మరికల్ మండల తహశీల్దార్ నాగలక్ష్మీ పడిపోయిన మట్టి ఇంటిని పరిశీలించారు.