మహబూబ్‌నగర్

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ గెలుపుకు నాంధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిడ్జిల్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకు నాంధి అని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంవిఎస్ పంక్షన్‌హల్‌లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఏ ప్రభుత్వాలు ప్రవేశ పెట్టని పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా పించన్,రైతులకు సాగునీరు,రైతుభీమా,కేసిఆర్ కిట్, పేద ప్రజలకు కళ్యాణలక్ష్మి వంటి అనేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీని ప్రథ్యక్షంగా ఎదుర్కోనే దమ్ములేక ప్రతిపక్ష పార్టీలు కుమ్మకై ఎన్నికలకు సిద్దమవుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అనంతరం అర్హులందరికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దీప, జడ్పిటీసి హైమావతి, గిరినాయక్, వైస్ ఎంపిపి సుదర్శన్, ఎంపిటీసిలు మంజుల, శివప్రసాద్, చెన్నయ్య, గోపాల్‌రెడ్డి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.