క్రైమ్/లీగల్

వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: అందరూ వినాయక నిమజ్జనం సంబురాల్లో మునిగితేలుతుండగా ఇద్దరి కుటుంబాల్లో మాత్రం విద్యుదాఘాతం విషాదాన్ని నింపింది. ఆకుంటుంబాల దోదన అందరినీ కన్నీటిపర్యంతం చేసింది. తల్లిదండ్రులకు కొరిమిపెట్టాల్సిన కొడుకుకు తామే కొరివి పెట్టాల్సి వచ్చిన దుస్థితిని చూసి ఆ తల్లిదండ్రులు రోదనను ఎవరూ ఆపిన వారి కడుపుకోత ఎవరూ తీర్చలేని దుఖం వారిది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఒకరు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని గొల్లబండాలోని రాజారామ్ వారి ఇంట్లో విషాదం నెలకొంది. రాజారామ్ శరత్‌తేజ (24) అనే యువకుడు గత కొన్ని నెలల క్రితమే బిటెక్ పూర్తి చేసుకుని సోమవారమే ఓ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లాల్సి ఉండగా ఆ యువకుడిని మృత్యువు వెంటాడింది. తమ ఇంటి ముందు ప్రతిష్టించిన గణనాథుడి విగ్రహన్ని నిమజ్జనం చేసి ఉద్యోగంలో చేరాలనే ఆశలు మంటకలిసిపోయాయి. ఈ విచారకమైన ఘటన అందరి వృదాయాలను కలిచివేసింది. గొల్లబండాకు చెందిన రామలింగం, పార్వతమ్మల కుమారుడు శరత్‌తేజ వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. తమ ఇంటి పరిసరాల్లో ప్రతిష్టించిన వినాయక విగ్రహన్ని నిమజ్జనం నిమిత్తం తరలించే ప్రకియలో విద్యుత్ వైర్లు సరిచేయడానికి ప్రయత్నించారు. అయితే ముందుగా విద్యుత్ వైర్ సరి చేయడానికి వెళ్లిన సమయంలో విద్యుత్ సరఫరాలేదు. విద్యుత్ సరఫరా లేదని వైర్‌ను సరి చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కరెంట్ సరఫరా వచ్చింది. దాంతో శరత్‌తేజకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కసప్పకూలిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులతో పాటు వినాయక మండపం దగ్గర ఉన్న యువకులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు. తమ కుమారుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. ఆదివారం పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు శరత్‌తేజ మృతదేహన్ని అప్పగించారు. ఇదిలా ఉండగా మరో సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ మల్లయ్య(35) అనే వ్యక్తి సైతం వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుదాఘాతానికి గురై మత్యువాత పడ్డారు. సౌండ్‌బాక్స్‌కు కరెంట్ సరఫరా కావడంలేదని దానిని సరి చేయడానికి ప్రయత్నించిన మల్లయ్యకు విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. దాంతో జంగారెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ప్రమాదవశాత్తు మురికికాలువలో పడి..
నాగర్‌కర్నూల్: తిమ్మాజిపేట మండలంలో ఎదిర గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో ప్రతిష్టించిన వినాయకులను శనివారం రాత్రి నిమజ్జనం కోసం ఊరేగింపు నిర్వహించగా, ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పాల్గొన్న వెంకటయ్య(40) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మురికికాలువలో పడగా, తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. దీనితో గ్రామంలో విషాధఛాయలు నెలకొన్నాయి.