మహబూబ్‌నగర్

పోరాడుతున్నాననే అక్రమ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, అక్టోబర్ 16: కోడంగల్ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు గెలుపొంది నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటుతో పాటు వౌళిక వసతుల కల్పనలో వేగం పెంచింది తానేనని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోస్గి పట్టణంలో, గుండుమాల్ గ్రామంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల పాటు ఇక్కడి దొర పాలన కొనసాగించినా అభివృద్ధికి నోచుకోక ఇక్కడి ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుండే వారని, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాతే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించానని ఆయన అన్నారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై ఒక్క రోజు కూడా మాట్లాడని గురునాథ్‌రెడ్డి అభివృద్ధికి కృషి చేసిన నన్ను ఓడించాలని ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. పట్నం ముఠాలతో జతకట్టి స్థానిక నాయకులు నియోజకవర్గంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన సూచించారు. పట్నం ముఠాల గురించి షాబాద్, తాండూరులో వారు చేసే పర్సెంటేజ్‌ల అక్రమాల బాగోతం ప్రజలు తెలుసుకోవాలని ఆయన కోరారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే అక్రమ కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేదరికంతో బాధపడుతూ యువత ఉన్నత చదువులు చదివినా వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ యువతను మోసం చేశారని, కులవృత్తులను విస్మరించిన ఎకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తామని, బడుగు బలహాలవర్గాలకు రెండు పడకగదులు నిర్మించి ఇస్తామని ఇలా ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆయన అన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి సమక్షంలో మండలానికి చెందిన సుమారు 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేందర్, వార్ల విజయ్ కుమార్, పీరంపల్లి అంజయ్య, రఘువర్ధన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, రాఘవరెడ్డి, ఆనంద్‌రెడ్డి, బెజ్జు రాములు, హన్మంతు, ఎర్ర కిష్టప్ప, ఇద్రీస్, తాహేర్‌పాషా, ఆసీఫ్‌లతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ మావోయిస్టుకు కన్నీటి వీడ్కోలు
* అజీలాపూర్‌లో గట్టి పోలీస్‌బందోబస్తు
వెల్దండ, అక్టోబర్ 16: ఆత్మహత్యకు పాల్పడిన మావోయిస్టు మాజీ పూర్వపు జిల్లా కార్యదర్శి గుండూర్ శ్రీను అలియాస్ రమాకాంత్ మంగళవారం వెల్దండ మండలం అజీలాపూర్ గ్రామంలో కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియాలు నిర్వహించారు. లింగాల మండల అంబటీపల్లిలో అత్మహత్యకు పాల్పడిన గుండూర్ శ్రీను అలియాస్ రమాకాంత్‌కు ఆచ్చంపేటలో పోస్టుమార్టం అనంతరం పోలీస్‌బందోబస్తు మద్య స్వ గ్రామం అజీలాపూర్‌కు మృతదేహన్ని తీసుకొచ్చారు. ఆనంతరం కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, మాజీ మావోయిస్టుల కన్నీటి వీడ్కోలు మధ్య శ్రీను అలియాస్ రమాకాంత్ అత్యక్రియలు జరిగాయి, ఈసందర్బంగా వెల్దండ సిఐ గిరికుమార్ కల్కొటా, ఎస్సై వీరబాబు అధ్వర్యంలో ముందుస్తుగానే గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

భీమా సంగమంలో భారీగా పుష్కర స్నానాలు
* అన్నదాన కార్యక్రమంలో ఆంధ్రా మహిళలు
* భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చిన
శ్రీరామప్రసన్నానంద స్వామీజీ
మక్తల్, అక్టోబర్ 16: కృష్ణా, భీమా నందుల కలయిక కావడంతో ఏర్పడ్డ ప్రత్యేక గుర్తింపు పొందిన నివృత్తి సంగమం మంగళవారం భక్తుల తాకిడితో పులకించింది. పుష్కర స్థానం కోసం నలు దిక్కుల నుండి భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. హైదరాబాద్, నిజాంబాద్, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలతో పాటు కర్నాటక రాష్ట్రంలోని రాయిచూర్, సిందనూర్ తదితర సుదూర ప్రాంతాల నుండి భక్తులు పుష్కర స్నానానికి తరలి వచ్చారు. తంగిడి నివృత్తి సంగమ ఘాట్‌తో పాటు అధికారికంగా ఏర్పాటు చేసిన కుసుమూర్తి, సుకూర్‌లింగంపల్లిలో ఏర్పాటు చేసిన మరో రెండు ఘాట్లల్లో అధికంగా నీరు ఉండటంతోటి భక్తులు ఈరెండు ఘాట్లల్లో స్నానాలు చేసేందుకై వెళుతున్నారు. సుకూర్‌లింగంపల్లి ఘాట్ వద్ద షవర్ స్నానాల ఏర్పాటుతో చిన్నారులు, వృద్ధులు అక్కడే పుష్కర స్నానాలు చేస్తున్నారు. పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు భీమా నదీమ తల్లికి పసుపు, కుంకుమలతో విశేష పూజలు నిర్వహించారు. సుకూర్‌లింగంపల్లి ఘాట్ వద్ద నది పరిసర ప్రాంతంలోని శివలింగానికి భక్తులు పసుపుకుంకుమలతోపాటు పుష్పాలు, నదీ జలాలు పారపోసి పండితుల మంత్రోక్షరణలో భక్తులు విశేష పూజలు గావించారు. భీమానదిలో భక్తులు తెప్పోత్సవాలు నిర్వహించారు. తెప్పలపై దీపాలు ఉంచి నదిలో వదులుతున్నారు. పిండ ప్రదానం అనంతరం సైతం వాటిని నదిమ తల్లికి సమర్పించి నమస్కరిస్తున్నారు. సుకూర్‌లింగంపల్లి, కుసుమూర్తి, తంగిడి ఘాట్‌లలో లక్ష్మీ వెంకటేశ్వరుడు, కృష్ణ దైపాయ మఠం, భీమ శంకర ఆలయాలలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి భగవంతుని సన్నిదిలో విశేష పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల వాహనాలను ఘాట్ల దగ్గరకు వెళ్లనీయకుండా వాహన పార్కు స్థలాల్లో ఉంచుతున్నారు. వృద్దులు, వికలాంగులు నడువలేని పరిస్థితిలో వారిని వాహనాల్లో ఘాట్ల వరకు పంపించి తిరిగి వాహనాలను పార్కింగ్ స్థలంలోనే ఉంచుతున్నారు. తంగిడి భీమశంకర మందిరంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆంధ్రకు చెందిన దత్తగురు మహిళలు అన్నదాన కార్యక్రమంలో తమ సేవలను భక్తులకు అందించారు. పుణ్యస్నానాలు ఆచరించి వచ్చిన భక్తులకు పస్పుల దత్తపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామప్రసన్నానంద స్వామీజీ ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇచ్చారు.
అసౌకర్యాలు కలుగకుండా అధికారుల పర్యవేక్షణ...
సూదూర ప్రాంతాల నుండి పుష్కర స్నానాలు చేసేందుక వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆర్డీఓ శ్రీనివాసులు, తహశీల్దార్ జ్ఞానేశ్వర్, సిఐ వెంకట్‌లతోపాటు ఇతర అన్ని శాఖల అధికారులు పలు జాగ్రతలు తీసుకుంటున్నారు. ఘాట్ల వద్ద రద్దీ పెరిగితే ఇతర ఘాటుకు పంపుతున్నారు. భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నారు. ఘాట్ల వద్ద భక్తుల సౌఖర్యార్థం స్వచ్ఛంద సంస్థలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు అన్నదానం, మంచినీటి వసతిని కల్పించడం, కొందరు భక్తులు స్వీట్లను తీసుకొచ్చి భక్తులకు అందించడం వంటి సేవాకార్యక్రమాలు చేయడంతోటి భక్తులు వారిని ఎంతగానో అభినందిస్తున్నారు. ఘాట్ల పరిసరాలో అవాంఛనీయ సంఘటనులు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రతగా 108, ఫైర్ వాహనాలను ఏర్పాటు చేసి అక్కడే ఉంచారు. ఘాట్ల సమీపంలో గజఈతగాళ్లను సైతం విధులో ఉంచారు. మంగళవారంతో 5వ రోజు కావడంతో భక్తులు దినదినం పెరుగుతున్నారని తెలియచేస్తున్నారు.