క్రైమ్/లీగల్

పోలీసుల సోదాల్లో రూ. 11లక్షలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట ,అక్టోబర్ 28: మండల కేంద్ర సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టువద్ద ఎస్‌ఐ తనిఖి చేస్తుండగా రూ. 6లక్షలు సీజ్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రవికాంత్‌రావులు తెలిపారు. టీఎస్ 06వికె 4371 అనే నెంబర్ గల ద్విచక్ర వాహనంపై కనిమెట్టకి చెందిన మల్లేష్ రూ.4లక్షలు తరలిస్తుండగా వాహనాన్ని సీజ్ చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రాంతానికి చెందిన నాగేశ్వర్‌రావు రూ.2లక్షలు తరలిస్తుండగా వాహనాన్ని సీజ్ చేశారు. ఈ వాహనాలను సీజ్ చేసి రూ.6లక్షలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. కాగా కనిమెట్టగ్రామానికి చెందిన మల్లేష్ పోస్టాఫీసులో విధులు నిర్వహిస్తున్నారని, ఇట్టి రూ.4లక్షలు దంతనూరులో పింఛన్ల పంపిణీకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
అయజలో..
అయిజ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు రాములు, రామగిద్దయ్య, పరుశరాములు, లోకేశ్వర్, వీఆర్‌వోలు అయిజ పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయిజ పట్టణానికి చెందిన షాలు తన మోటార్ సైకిల్‌పై వస్తుండగా పోలీసులు తనిఖీలు చేయగా అతని నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.5లక్షల నగదును స్వాధీనపర్చుకున్నారు. స్వాధీనపర్చుకున్న నగదును జిల్లా టీంకు అప్పగించారు.