మహబూబ్‌నగర్

నాగర్‌కర్నూల్ శాసనసభ నియోజకవర్గంలో 8 నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, నవంబర్ 16: వచ్చేనెల 7న రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు శుక్రవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తమ మద్దతుదారులతో సాధారణంగా వచ్చిన అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ వేసిన వారిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి రెండు నామినేషన్ల సెట్లను వేయగా, ఆయనకు మద్దతుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే వంగ మోహన్‌గౌడ్, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ వెంకటయ్య, కౌన్సిలర్ హబీబ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థిగా నెడనూరి దిలీపాచారి మూడు నామినేషన్ సెట్లను దాఖలు చేయగా, ఆయనకు మద్దతుగా మున్సిపల్ వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, బీజేపీ నేతలు బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి, దిలీపాచారి సతీమణి తదితరులు పాల్గొన్నారు. బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా శ్రీనివాస్‌బహుదూర్ నామినేషన్ వేయగా, ఆయనకు మద్దతుగా ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, రామయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందికొండ గీత, సీఐటీయు జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు పాల్గొన్నారు. బీఎస్పీ అభ్యర్థిగా బాకీ రేణుక, ప్రజాస్వరాజ్ పార్టీ అభ్యర్థిగా వి.గాలెమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఎఎస్పీ జోగుల చెన్నయ్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేయగా, శుక్రవారం నామినేషన్ వేసిన వారి వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమనాయక్ విలేఖరులకు వివరించారు.

బీజేపీ అభ్యర్థి నామినేషన్
కోస్గి, నవంబర్ 16: కోడంగల్ నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం మొదలైంది. శుక్రవారం బీజేపీ అభ్యర్థి నాగురావు నామాజీ కోడంగల్ పట్టణంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వెంకటేష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం నాగురావు నామాజీ విలేకర్లతో మాట్లాడుతూ కోడంగల్ నియోజకవర్గం నుండి గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అభివృద్ధికి ఏనాడు కృషి చేయడలేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటువేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని, జీఓ నం.69ను అమలు చేసి నారాయణపేట-కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి నియోజకవర్గంలోని లక్షా పదివేల ఎకరాలకు సాగునీరందించి తీరుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మదన్, నాయకులు కూర వెంకటయ్యతో పాటు తదితరులు ఉన్నారు.