మహబూబ్‌నగర్

కరవు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, మే 17: జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు పంటరుణాలు మాఫీ చేయడంలో ఈప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని అన్నారు. పంట రుణాలు మాఫీచేసి కొత్తరుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ చైతన్యం లేని రోజుల్లో నాడు తమ అధినేత నందమూరి తారకరామారావు ప్రజలను చైతన్య వంతులుగా తీర్చిదిద్దడం జరిగిందని, నేడు ప్రజలు ఎంతో చైతన్యంతో ఉన్నారని ప్రజలను మోసం చేసిన ఏరాజకీయ పార్టీనైన భూస్తాపితం చేయడం ప్రజల చేతుల్లో ఉందని అన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు పెండింగ్ ప్రాజెక్టుల ఊసే ఎత్తడం లేదని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పుణ్యం గత పాలకులైన కాంగ్రెస్ ప్రభుత్వానిదే అంటూ దూషించడం తప్పా తాము ఒక్క చుక్కా నీరైన ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు పాలనలో జన్మభూమి పేరుతో నీటి తొట్టిలు, ఉచిత పశుగ్రాసం పంపిణి చేసిన ఘనత ఉందని, నేడు కరువుతో గ్రాసం లేక మూగజీవులు అల్లాడుతుంటే చూడలేని రైతన్నలు కలేబరాలకు తరలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవ వైవిద్య చట్టం ప్రకారం సకల ప్రాణులను కాపాడవలసిన బాధ్యత పాలకులకు ఉంటుందని అన్నారు. ఎప్పుడు ఇతరులపై గతంలో వారి పాలనలో ఏమి చేశారు అన్న విమర్షలకంటే ప్రజల శ్రేయస్సుకోరి పనిచేయవలసిన అవసరం పాలక పక్షానికి ఎంతైన ఉందని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం చేయించేందుకై పల్లెపల్లెలో తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి రాంచంద్రారెడ్డి, నాయకులు సుధాకర్, చంద్రకాంత్‌గౌడ్, తాయప్ప, మధుసూదన్‌రెడ్డి, విశ్వనాథ్, రామన్‌గౌడ్, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.