మహబూబ్‌నగర్

ఈదురు గాలులతో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మే 20: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం షాద్‌నగర్ పట్టణంతో పాటు కొత్తూరు, సమీప గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు కొన్ని గ్రామాలలో భారీ వృక్షాలు విరిగిపోవడంతో పాటు ఇళ్ల పైకప్పులు సైతం గాలికి కొట్టుకుపోయాయి. ఈదురు గాలుల కారణంగా ముందుగానే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశ్యంతో ట్రాన్స్‌కో అధికారులు ముందు జాగ్రత్తగా నిలిపివేశారు. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో చల్లదనం చోటు చేసుకుంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు చిరు జల్లులు కురుస్తుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈదురు గాలుల కారణంగా షాద్‌నగర్ పట్టణ సమీపంలోని పాత జాతీయ రహదారిపై భారీ వృక్షం విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు రోడ్డుపై పడిన చెట్టును పక్కన తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు.