మహబూబ్‌నగర్

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు కాలువలకు మరమ్మతు చేయాలంటూ కాంగ్రెస్ నేతల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 20: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కాలువలకు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ఇరిగేషన్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మరో వారం రోజుల వ్యవధిలో ఖరీఫ్ సిజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కాలువలను, తుములను మరమ్మత్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయకట్టుకు సంబందించిన కాలువల్లో సిల్ట్ పెరుకుపోయిందని వాటిని తొలగిస్తేనే వచ్చే ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు అందుతుందన్నారు. కొయిల్‌సాగర్ పెండింగ్ ప్రాజెక్టు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని 90శాతంకుపైగా పనులు పూర్తి అయినప్పటికిని టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక మిగిలిన 10శాతం పనులను చేపట్టకపోవడం విడ్డురంగా ఉందన్నారు. ప్రభుత్వం కావాలనే కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో చేపట్టడం లేదని ఆరోపించారు. 50వేల ఆయకట్టు ఈ ఖరీఫ్ సిజన్‌లోనే సాగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న 12 వేల ఎకరాల ఆయకట్టుకు వచ్చే ఖరీఫ్‌లో నీరు అందాలంటే ప్రధానంగా కాలువల మరమ్మత్తు పనులు, తుముల మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం సంబందిత అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున హజరయ్యారు.