మహబూబ్‌నగర్

డ్రైవరే మోసగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 31: అద్దెకు కారును తీసుకుని కర్నూల్ నుండి హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి కర్నూల్‌కు వస్తున్న సందర్భంలో కారు డ్రైవర్ వ్యక్తిని మోసగించి రూ.15లక్షలను ఊడాయించి తనకేమీ తెలియనట్లు నటించి తప్పించుకుందామనిచూసిన డ్రైవర్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ఆసలు నింధితుడిగా గుర్తించారు. మంగళవారం జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్నూల్‌కు చెందిన నిఖిల్ పండ్ల వ్యాపారి అని ఆయన ఏప్రిల్ 30వ తేదిన కర్నూల్‌కు చెందిన ఏపి 21 ఏ ఆర్ ఏ 0243 నంబర్ గల కారును హైదరాబాద్‌కు అద్దెకు తీసుకుని వెళ్లారు. అద్దె కారుకు కర్నూల్‌కు చెందిన భాస్కర్ అనే వ్యక్తి డ్రైవర్‌గా ఉన్నాడు. అయితే నిఖిల్ హైదరాబాద్‌లో తన స్నేహితుడు హకీంబాయ్‌ని కలిసి ఆయన దగ్గర రూ.15లక్షలను తీసుకుని తిరిగి కారులో కర్నూల్‌కు బయలుదేరారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోకి రాగానే జమ్ జమ్ దాబా దగ్గర ఆగారు. అయితే కారులో నుండి నిఖిల్ దిగుతూ రూ.15లక్షలు డబ్బులు ఉన్న బ్యాగును కారులోనే ఉంచి బయటికి వచ్చి దాబాలోకి వెళ్లారు. అయితే డ్రైవర్ భాస్కర్ మాత్రం నిఖిల్ వెంట వచ్చినట్లు వచ్చి బ్యాగును వెంటనే ముందస్తు తన బంధువులకు సమాచారం ఇచ్చి డబ్బున్న బ్యాగును వారికి అందించాడు. ఏమీ తెలియనట్లు డ్రైవర్ భాస్కర్ నిఖిల్‌తో కూర్చోన్నాడు. తిరిగి కారులోకి వచ్చి చూసేసరికి రూ.15లక్షల రుపాయల బ్యాగు కనబడకపోవడంతో జడ్చర్ల పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ డ్రైవర్ భాస్కర్ ఫోన్ కాల్ డాటాను తీయగా ఆసలు నిజాలు బయటకు వచ్చాయి. భాస్కర్ బంధువులు మద్దిలేటి, రామచిన్నప్పలకు రూ.15లక్షలు తీసుకెళ్లినట్లు రుజువు కావడంతో పోలీసులు వీరిని ఆరెస్టు చేసి విచారించారు. ఈ డబ్బును మూడు బాగాలుగా పంచుకున్నట్లు తెలింది. ఈ మేరకు ముగ్గురు నింధితులను ఆరెస్టు చేసి వారి నుండి రూ.15లక్షలను రికవరి చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. డ్రైవరే మోసగాడని డబ్బును చూసి దురాశ చెంది వారి బంధువులకు సమాచారం ఇచ్చి దొంగతనానికి పాల్పడ్డాడని ఎస్పీ పెర్కోన్నారు. విలేఖరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు, డిఎస్పీ కృష్ణమూర్తి, సిఐ గంగాధర్, ఎస్సై జంబులప్ప తదితరులు పాల్గొన్నారు.