మహబూబ్‌నగర్

రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, మే 31: రాష్ట్రంలో విచ్చలవిడిగా రాజకీయ ఫిరాయింపులకు పాల్పడుతూ టిర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నదని ఎఐసిసి కార్యదర్శి, వనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ జి.చిన్నారెడ్డి విమర్శించారు. మంగళవారం వనపర్తి పిఆర్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను టిఆర్‌ఎస్ 63 స్థానాల్లో గెలుపొంది పూర్తి మెజారిటీ సాధించినప్పటికీ రెండేళ్లలో రాజకీయ ఫిరాయింపులకు పాల్పడి 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఆయన ఆరోపించారు. టిర్‌ఎస్ పక్షాన నామమాత్రంగా ఉన్న ఎమ్మెల్సీలు నేడు 20 మందికి చేరడం నిజంకాదా అని ఆయన అన్నారు. తమ పాలనలో అవినీతిని రూపుమాపామని చెబుతున్న కేసిఆర్ పార్టీ మారిన ఎమ్మెల్యేకు డబ్బులు ఎలా ఇచ్చారని, పార్టీ ఫిరాయింపుల్లో కోట్ల రూపాయలు చేతులు మారింది నిజంకాదా అని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి ఆ డబ్బును ఎరచూపి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడంతో పాటు ఉపఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చుచేశారని ఆయన ఆరోపించారు. కొత్త రాష్ట్రంలో ఇంత అవినీతి జరుగుతుందని ఊహించలేదన్నారు. అదే పరిస్థితి నియోజకవర్గాల్లో నెలకొన్నదని, సర్పంచ్‌ల నుండి ఎంపిటిసిలు, ఎంపిపిలను పనులకు, డబ్బులను ప్రలోబపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారన్నారు. అధికార పార్టీ నేతలు ఉద్యోగాలిప్పిస్తామని, బదిలీలు చేయిస్తామని డబ్బులు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. కెసిఆర్‌ది సాధారణ కుటుంబమేనని, అవినీతికి పాల్పడకపోతే పార్టీ ఫిరాయింపులకు, ఉపఎన్నిల్లో ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడతారని ఆయన ప్రశ్నించారు.
మిషన్ భగీరథను 40వేల కోట్లకు పెంచారని, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు రీజైనింగ్ పేరుతో 32,500 కోట్లకు పెంచారని ఆయన అన్నారు. గతంలో ఏప్రభుత్వంలో ఇంత అవినీతి చూడలేదని ఆయన అన్నారు. తెలంగాణ విద్యారంగంలో వెనుకబడిందని, విద్యాలయాలను ప్రోత్సహించకుండ భయపెడుతూ స్వంత విద్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. కెసిఆర్ కుమారుడు పశ్చిమానికి, కుమార్తె తూర్పునకు పెట్టుబడులను ఆకర్శించేందుకు వెళ్లారని, వారంత సమర్థులు అధికార పార్టీలో ఇంకవరూలేరా అని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబం నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి మరోపోరాటం చేస్తామని, కలిసి వచ్చిన వారిని కలుపుకొని పోయి ప్రజాస్వామ్యాన్ని కాపడటంకోసం ఎంత త్యాగానికైనా వెనుకాడమని చిన్నారెడ్డి అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షులు శంకర్ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు తిరుపతయ్య, జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్, మహిళా నాయకురాలు ధనలక్ష్మి, నాయకులు కిరణ్‌కుమార్, కృష్ణబాబు, శ్యాంకుమార్, చంద్రవౌళి, బాబా, అబ్దుల్లా, మన్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్లాట్ దక్కలేదనే మనస్థాపంతో యువకుడు మృతి
*ఆగ్రహించిన కుటుంబ సభ్యులు
ఖిల్లాగణపురం, మే 31: ప్లాట్ దక్కలేదనే మనస్థాపంతో ఒక యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పెద్దచర్క శ్రీనివాసులు(38) తండ్రి ఒక మైనార్టీ నాయకుని వద్ద మజీద్ సమీపంలో గతంలో ప్లాటును కొనుగోలు చేశారు. శ్రీనివాసులు ప్లాటును అమ్మాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. అందుకు మజీద్ కమిటీ నేతలు ఆ ప్లాటు స్థలం మజీదుకు సంబంధించినదని, ఎలాంటి నిర్మాణాలకు గాని, విక్రయాలకు గాని వీలులేదని అడ్డుపడుతూ వచ్చారు. 10 రోజుల క్రితం అనారోగ్యంతో శ్రీనివాసులు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. ఆసుపత్రిలో చికిత్సకోసం డబ్బులు అవసరం ఉండటంతో ఆప్లాటును మీరే తీసుకొని డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పినా మైనార్టీ నాయకులు ఒప్పుకోకపోవడంతో వైద్య ఖర్చులకు లేక చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువులు, కాలనీవాసులు శవాన్ని తీసుకొని మైనార్టీ నాయకు ఇంతియాజ్ ఇంటికి వెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి, బస్టాండ్ ఆవరణలో ఉన్న ఇంతియాజ్ షాపుపై దాడి చేసి నిప్పుపెట్టారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఎస్సై మచ్చందర్ రెడ్డి ఇరువర్గాలను చెదరగొట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.