మహబూబ్‌నగర్

వేర్వేరు ప్రమాదాల్లో భారీ ఆస్తినష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాలటౌన్, మే 31: రెండు వేర్వేరు ప్రమాదాల్లో మండలంలో భారీ ఆస్తినష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల మండలంలోని పరుమాల గ్రామంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులు నిర్వహించేందుకు నంద్యాల నుంచి లారీలో జెసిబిని తీసుకవస్తున్నారు. పరుమాల చెరువు కట్ట దగ్గర విద్యుత్ హైటెన్షన్ వైర్ తగిలి లారీ, జెసిబిలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకవచ్చారు. గ్రామంలో ఎలాంటి ప్రమాదం లేకుండా ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.7లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపారు.
పెట్రోల్ ట్యాంకర్ బోల్తా... ఒకరి మృతి
పట్టణంలోని ఓ ప్రైవేటు పెట్రోల్ బంక్‌కు పెట్రోల్‌ను తీసుకవస్తుండగా ప్రమాదవశాత్తు సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీస్‌స్టేషన్ ఎదురుగా పెట్రోల్ ట్యాంకర్ డ్రైనేజీలో బోల్తాపడింది. ఈ ఘటనలో కొత్తకోట మండలం, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన లారీ క్లీనర్ రామకృష్ణ(28) అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ట్యాంకర్ బోల్తాపడడంతో పెద్ద పెనుప్రమాదమే తప్పిందని పట్టణ వాసులు వాపోయారు. పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడి పెట్రోల్ లీక్ అవుతుండడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, పెట్రోల్ బంక్ యజమానులు చాకచక్యంగా క్రెయిన్ ద్వారా ట్యాంకర్‌ను బయటకు తీశారు. ట్యాంకర్‌లో దాదాపు రూ.8లక్షల విలువచేసే పెట్రోల్ ఉన్నట్లు యజమాని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ ఎస్‌ఐ నారాయణసింగ్ తెలిపారు.
మిషన్ కాకతీయ పనుల పరిశీలన
పాన్‌గల్, మే 31: మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి, రాయినిపల్లి, పాన్‌గల్ గ్రామాలో మిషన్ కాకతీయ పనులను మంగళవారం ఐబి ఎఇ గిరిధర్ రావు పరశీలించారు. మిషన్ కాకతీయ పనులను నాణ్యవంతంగా చేపట్టాలని ఆయన సూచించారు. కాంట్రాక్టర్లు ప్రతిపాదనలు ఆదారంగా పనులు నిర్వహించాలని, పనులలో నాణ్యత లోపిస్తే బిల్లులు చెల్లించబడవన్నారు.
ఉద్యమబంధం బలమైనది
* టిజేఏసి చైర్మన్ కొదండరాం
మహబూబ్‌నగర్‌టౌన్, మే 31: తెలంగాణ ఉద్యమ బంధం చాలా బలమైందని తెలంగాణ అవిర్భావం దినోత్సవం సందర్భంగా జరిగే సంబరాలు ఉద్యమకారులను గౌరవించేలా సంబరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని టిజేఏసి చైర్మన్ కొదండరాం అన్నారు. టిఎన్‌జిఓ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా స్థానిక టిఎన్‌జిఓ హల్‌లో మంగళవారం ఆయన రాజేందర్‌రెడ్డిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో దాదాపు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను ఒకేతాటిపైకి తీసుకువచ్చిన ఘనత టిఎన్‌జిఓ, టిజేఏసికి దక్కిందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు కోసం సడక్ బంద్ నిర్వహిస్తే అనేక మంది ఆరెస్టులు కావల్సి వచ్చిందన్నారు. ఉద్యమంలో టిఎన్‌జిఓ అధ్యక్షులు రాజేందర్‌రెడ్డి అగ్రభాగాన నిలిచి ఆరేళ్లు కలిసి పని చేశారని తెలిపారు. రాష్ట్ర సంబరాల్లో భాగంగా టిజేఏసి ఆధ్వర్యంలో ర్యాలీలు, ప్రదర్శనలు సంస్కృతిక కార్యక్రమాలు ఆయా కమిటీల స్థాయిలో ఎక్కడికక్కడ విలైనన్ని కార్యక్రమాలు చేయాలని సూచించారు. అదే ఉద్యమ స్పూర్తితో తెలంగాణ అభివృద్ధిలో టిజేఏసి నిర్ణయాత్మక పాత్ర పోషించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులు రాజేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ కొదండరాంను సన్మానించారు.