మహబూబ్‌నగర్

తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఘనసన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 2: తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా సన్మానించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, ఎస్పీ రేమా రాజేశ్వరి, జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాలను కూడా అందజేశారు. 21మంది అమరవీరుల కుటుంబాలలోని ఒక్కొక్కరికి ఒక్కో ఉద్యోగం వివిధ కేటాగిరిలో కేటాయిస్తూ ఉత్తర్వులకు సంబంధించిన నియామక పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. అయితే అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వారిని సన్మానిస్తున్న సమయంలో ఒక్కసారిగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిశబ్ద వాతావరణం నెలకొంది. కొందరు మహిళలు తమ దూరమైన కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని బోరున విలపించారు. దీంతో అక్కడి వారంతా హృదయాలు చలించాయి. ముఖ్యంగా తండ్రిని కోల్పోయిన పిల్లలు విలపించడంతో వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ టికె శ్రీదేవి అక్కున చేర్చుకుని ఓదార్చారు.
తెలంగాణ ఉద్యమంలో జిల్లాలోని కొత్తకోట మండలం మీరాస్‌పల్లి గ్రామానికి చెందిన అమరులైన విద్యార్థిని సువర్ణ సోదరుడు రాధాకృష్ణకు ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా కొత్తకోటకు చెందిన దాసరి నరేష్‌కు సంబంధించిన ఆయన సోదరుడు సురేష్‌కు, గోపాల్‌పేట్ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన శంకర్‌కు సంబంధించిన ఆయన సోదరుడు మహేష్‌కు, పెద్దమందడికి చెందిన వీరసాగర్‌కు సంబంధించిన ఆయన సోదరి పద్మకు, ఆమ్రాబాద్ మండలం వెంకటేశ్వరం గ్రామానికి చెందిన నాగరాజు సంబంధించిన సోదరుడు మహేష్, ఉప్పునుంతలకు చెందిన బాలస్వామి భార్య అలివేలుకు, జడ్చర్ల మండలం కోడుపర్తి గ్రామానికి చెందిన మల్లేష్ సోదరుడు వేణుగోపాల్‌కు, కల్వకుర్తి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన కృష్ణయ్య కుమారుడు రాముకు, ఆమన్‌గలు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కొప్పు వాసు భార్య శోభకు, తలకొండపల్లి మండలం దేవునిపడకల్ గ్రామానికి చెందిన వెంకటేష్ సోదరుడు యాదయ్యకు ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి జూపల్లి కృష్ణారావు అందజేశారు. అదేవిధంగా తలకొండపల్లి మండలం గురిపల్లి గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసు సోదరి తిరుపతమ్మకు, తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన మాదూరి చంద్రయ్య కూతురు మంజులకు, మహబూబ్‌నగర్ పట్టణంలోని అనిల్‌కుమార్‌రెడ్డి సోదరుడు రాజేందర్‌కు, షాద్‌నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన కొమ్ము యాదయ్య భార్య కొమ్ము విజయలక్ష్మీకి, షాద్‌నగర్ పట్టణంలోని ఎల్‌ఎన్ కాలనీకి చెందిన పాపకంటి శేఖర్ భార్య వౌనికకు, ఫరూఖ్‌నగర్ మండలం మధురాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్‌గౌడ్ భార్య శివలీలకు, కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కరుణాకర్ సోదరుడు జంగయ్యకు, కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన ప్రేమ్‌రాజ్ భార్య లక్ష్మీకి, ఘనపూర్ గ్రామానికి చెందిన సత్యమ్మ కుమారుడు నాగరాజుకు, ధన్వాడ మండలం కొండాపూర్‌కు చెందిన అశోక్‌కుమార్‌గౌడ్ సోదరి మంజులకు, బాలానగర్ మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన బోయ చెన్నయ్య భార్య రాములమ్మకు సైతం ఉద్యోగ నియామక పత్రాలను మంత్రి అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులను కూడా ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు అధికారులు ఘనంగా సన్మానించారు.