మహబూబ్‌నగర్

ఊరూవాడ తెలంగాణ సంబురాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ద్వితీయ ఆవిర్భావ సంబురాలు ఊరువాడలో ఘనంగా కొనసాగాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సంబరాలు ఆకాశానంటాయి. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల్, అలంపూర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ పట్టణాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర జిల్లా కేంద్రంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా బిజెపి నాయకులు సైతం అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆపార్టీ జిల్లా అధ్యక్షులు ఒబేదుల్లా కొత్వాల్ అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. మున్సిపల్ రాధాఅమర్ ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మహబూబ్‌నగర్ పట్టాణానికి చెందిన వేలాది మంది మహిళలు పెద్ద ఎత్తున హాజరై తెలంగాణ బతుకమ్మలను ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తుడిగా ఉండి ముందుండి పోరాడిన ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఉద్వేగంగా నాటి ఉద్యమంలో ఉదుర్కొన్న సమస్యలను, భయానక స్థితులను గుర్తుచేశారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు, ప్రజలు ఒక్కసారిగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగానికి చప్పట్లతో మద్దతు తెలిపారు. సాగరహారం, సడక్‌బంద్, అసెంబ్లీ ముట్టడి, సకల జనుల సమ్మె వంటి ఉద్యమాలను గుర్తుచేస్తున్న సందర్భంగా ప్రజల నుండి ఎమ్మెల్యేకు మంచి స్పందన లభించింది. అయితే ఉద్యమకారులను సైతం సన్మానించాల్సి ఉందని, కొన్ని అనివార్య కారణాల వల్ల సన్మానించలేకపోయామని, అందుకే తాను తన నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ పోరాటం చేసిన వారిని దాదాపు 120మంది ఉద్యమకారులను సన్మానించానని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అడుగు జాడల్లో తామంతా నడుస్తూ జిల్లాను అభివృద్ది పథంలో నడిపిస్తామని, ఇంకా ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్పూర్తి బలంగా ఉందని, అందుకే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని పండుగ వాతావరణంలో నిర్వహించుకున్నారని అన్నారు. అనంతరం మహిళలకు చెక్కులను, గ్యాస్ పొయ్యిలను పంపిణీ చేశారు. అదేవిధంగా గత వారం రోజులుగా మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ రంగాలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.