మహబూబ్‌నగర్

ముదురుతున్న జిల్లాల పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 3: ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అంకురార్పణ చేస్తానని అధికారికంగా ప్రకటన చేయడంతో అప్పటి నుండి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్త జిల్లాల పంచాయతీ మొదలైంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన విధానంలో, జిల్లా మంత్రులు, అదికారయంత్రాంగం సైతం వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలను కొత్త జిల్లాలుగా చేయాలని యోచిస్తూ ఇటివల ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే రానున్న దసరా నాటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో కొత్త జిల్లాలు తమ ప్రాంతానికి కావాలంటూ డిమాండ్ చేస్తున్న వారు మరింత ఉద్యమాలను ఉదృతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. అందులో గద్వాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఓ అడుగు ముందుకేసి ఇప్పటికే గద్వాలను జిల్లా చేయాలని ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే డికె భరతసింహరెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి యాత్ర చేస్తూ జిల్లా సాధన కోసం ప్రజలందరు నడుం బిగించాలని గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే తన సతిమణి మాజీ మంత్రి డికె అరుణ తన ఎమ్మెల్యే పదవికి జిల్లా కోసం రాజీనామా చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు కూడా ప్రకటించారు. దింతో నడిగడ్డ ప్రాంతంలో ఒక్కసారిగా రాజకీయ వేడి మొదలైంది. అంతేకాకుండా నారాయణపేటలో కూడా జిల్లా కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఓ వేదికపైకి వచ్చి నిరాహర దీక్షలు ఎడ్లబండ్ల ర్యాలీలు, నారాయణపేట బంద్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నారాయణపేట డివిజన్‌లోని 15 మండలాలు ఉన్నాయని జిల్లా ఏర్పాటు చేయడానికి దాదాపు 14లక్షలకు పైగా జనాభా ఉందని ఆ ప్రాంత నాయకులు అధికారులకు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. అయితే జిల్లా చేయడానికి అన్ని వసతులు ఉన్న నారాయణపేటకే మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తీసుకువస్తున్నారు. గద్వాల ప్రాంతం వారు కూడా అక్కడ రైల్వే జంక్షన్‌తో పాటు కలెక్టర్ కార్యాలయానికి సంబందించిన వసతులు ఉన్నాయని, నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయని అన్నింటికి మించి రెండు జీవనదులు ఉన్నాయని చెబుతున్నారు. వనపర్తి, నాగర్‌కర్నూల్ కన్నా తమ ప్రాంతాలే జిల్లాలకు అనువుగా ఉన్నాయని ఓ పక్క గద్వాల ప్రాంత వాసులు మరోపక్క నారాయణపేట నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి నిర్ణయం ఏ విదంగా ఉంటుందో కానీ వివిధ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులకు మాత్రం జిల్లాల ఏర్పాటు తలనొప్పి వ్యవహరంగా మారే అవకాశాలు ఉన్నాయని కొందరు టిఆర్‌ఎస్ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం నాగర్‌కర్నూల్ , వనపర్తి జిల్లాలను చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ ప్రాంత వాసులు తప్పకుండా తమ ప్రాంతాలు జిల్లాలుగా ఏర్పడుతాయని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.