మహబూబ్‌నగర్

నల్లమలలో ఠాణాలను సందర్శించిన డిఐజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన్ననూర్, జూన్ 14: మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని నల్లమలలోని పలు పోలీస్ స్టేషన్లను హైదరాబాద్ డిఐజి అకున్ సబర్వాల్ మంగళవారం సందర్శించారు. అమ్రాబాద్ మండలంలోని పదర ఔట్‌పోస్టు, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్, మన్ననూర్‌లో కొత్తగా నిర్మించిన పోలీస్ ఔట్‌పోస్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో గత 10 సంవత్సరాల నల్లమల పరిస్థితులలో గురించి ఆయన ఆరా తీశారు. ఇటీవలే డిఐజిగా బాధ్యతలు స్వీకరించిన సబర్వాల్ హైదరాబాద్ రేంజి పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలపై అవగాహన కల్పించుకునేందుకు నల్లమలను సందర్శించారు. ఆయన వెంట నాగర్‌కర్నూల్ డిఎస్పీ ప్రవీణ్‌కుమార్, అమ్రాబాద్ సిఐ శ్రీనివాసులు, ఎస్సై శ్రీనివాసులు ఉన్నారు.