మహబూబ్‌నగర్

ఉలిక్కిపడ్డ పాలమూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 16: మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలు గురువారం మధ్యాహ్నం ఉలిక్కిపడ్డారు. పట్టణ సమీపంలోని దర్మాపూర్ వద్ద ఆర్టీసి బస్సు, ఆటో ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు చనిపోయారని తెలియడంతో పట్టణ ప్రజలు పరుగులు తీసుకుంటూ ధర్మాపూర్ వైపు వెళ్లారు. అక్కడ కనబడ్డ దృశ్యాలు ఆందోళనకు గురి చేశాయి. రోడ్డుపై చెల్లాచెదురుగా మృతదేహాలు పడడం ఓ మూడేళ్ల చిన్నారి విగతజీవిగా రోడ్డు పక్కన దాదాపు 10 ఫీట్ల దూరంలో పడి ఉండడం అందరిని కలిచివేసింది. మహబూబ్‌నగర్ నుండి పోతన్‌పల్లి వైపు వెళ్తున్న ఆటోను దేవరకద్ర నుండి మహబూబ్‌నగర్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు గాలిలో ఎగిరిపడి ఆటో నుజ్జునుజ్జు కావడం ఓ చిన్నారి ఆటోలో నుండి గాలిలో ఎగిరిపడి మృతి చెందిన సంఘటనలు ప్రత్యక్షంగా చూసిన వారు ఆ దృశ్యాలను నెమరువేసుకుంటూ ఆందోళన చెందారు. ఈ ప్రమాదానికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరకద్ర నుండి టిఎస్06జడ్0197 నంబర్ గల ఆర్టీసీ బస్సు, మహబూబ్‌నగర్ నుండి పోతన్‌పల్లి వైపు వెళ్తున్న ఏపి 22ఎక్స్3640నంబర్ గల ఆటోను దర్మాపూర్ దగ్గర ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న మహబూబ్‌నగర్ పట్టణం బండ్లగేరికి చెందిన ముగ్గురు అంజమ్మ(50), లక్ష్మమ్మ(60), శిరీష(3), రామయ్యభౌళికి చెందిన సయ్యద్ ఖాజా(42)లు దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు పోతన్‌పల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మైబు, వెంకటయ్య, బండ్లగేరికి చెందిన సిందూజలు తీవ్రగాయాల పాలయ్యారు. ప్రమాదం జరిగిన విషయం తెలియంతో వెంటనే రూరల్ సిఐ రామకృష్ణ, ఎస్సైలు రాజేశ్వర్‌గౌడ్, సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడంతో ఆటో నుజ్జునుజ్జు కావడం దాంతో ఆటోలోని ప్రయాణికులు మృతి చెంది రోడ్డుపై చెల్లచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ రామకృష్ణ వెల్లడించారు. సంఘటన స్థలాన్ని డిఎస్పీ కృష్ణమూర్తిసైతం పరిశీలించారు. బస్సు డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా బస్సును నడపడంతోనే ఆటోను ఢీకొట్టాడని, దీంతో నలుగురు మృతి చెందారని, మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయని డి ఎస్పీ తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో తెలియడంతో జనం ప్రమాద స్థలానికి వందలాదిగా చేరుకున్నారు.