మహబూబ్‌నగర్

దేశ రాజకీయాల్లో పివి అపరచాణక్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూన్ 28: దేశ రాజకీయాల్లో పివి నరసింహరావు అపరచాణక్యుడని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కొనియాడారు. దివంగత మాజీ ప్రదానీ పివి నరసింహరావు 95వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డిసిసి అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో పివి నరసింహరావు సంస్కరణలకు బాటలు వేసిన మహనుభావులని కొనియాడారు. దేశ ప్రజల కోసం ఎన్నో చట్టాలు తెచ్చి భారతదేశ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేశారన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు బాగుపడాలని నవసమాజ నిర్మాణం కోసం పాటుపడిన వ్యక్తి అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అగమ్యగోచర స్థితిలో ఉన్నప్పుడు తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చి ఐదేళ్ల పాటు సుదీర్ఘమైన పాలన అందించిన గొప్ప రాజకీయ యోదుడని వెల్లడించారు. డిసిసి అధ్యక్షుడు కొత్వాల్ మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు దేశానికి చేసిన సేవలు మరవలేనివని, ఆసియా ఖండంలోనే ఉత్తమ నాయకుడిగా ఎదిగారన్నారు. ఆయన చూపిన మార్గంలో యువత నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి నాయకులు ముత్యాల ప్రకాష్, రంగారావు, పటేల్ వెంకటేష్, విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.