మహబూబ్‌నగర్

బహుళజాతి కంపెనీలకు సాగుకు యోగ్యమైన భూములు ఇవ్వొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములను బహుళజాతి కంపెనీల కోసం బలవంతంగా సాగులోకి తీసుకోవడాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ అన్నారు.
మంగళవారం మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ పౌరహక్కుల సంఘం, తెలంగాణ రైతాంగ సమితి ఆధ్వర్యంలో ఎక్వాయిపల్లిలో నిజనిర్థారణ చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మట్లాడుతూ నాలుగు దశబ్దాల కాలంగా రైతులు సాగుచేసుకుంటున్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర ఏ జీవనాధారం లేని నిరుపేద రైతుల వద్ద ఫార్మాసిటీ కంపెనీల పేరుతో భూములు లాక్కోవడానికి అధికార ప్రభుత్వం పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. దీనిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎదుర్కొంటామన్నారు. రైతులను భయబ్రాంతులకు గురిచేయడం అపకపోతే తగిన రితీలో బుద్ది చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, న్యాయవాది లక్ష్మణశర్మ, తెలంగాణ రైతాంగ సమితీ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, ప్రజా సంఘాల నాయకులు కృష్ణారెడ్డి, నాగభూషణ్, నరసింహ, రాములు, సుధాకర్, అంజన్న తదితరులు పాల్గొన్నారు.