మహబూబ్‌నగర్

ఘనంగా ఈద్-ఉల్-్ఫతర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 7: అత్యంత పవిత్రంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి ఈద్- ఉల్- ఫితార్ సందర్భంగా ఉపవాస దీక్షలను విడిచి రంజాన్ పండుగ వేడుకలను గురువారం జిల్లాలో ముస్లీంలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, గద్వాల, మక్తల్, అలంపూర్, కోస్గి, కొడంగల్, దేవరకద్ర, నారాయణపేట, అయిజ, కొత్తకోట, ఆత్మకూరు, వనపర్తి పట్టణాలతో వివిధ మండలాల్లో ముస్లింలు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయానే్న మసీదుల దగ్గరకు చేరుకుని అక్కడి నుండి ఈద్గా వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈద్గాల దగ్గర నమాజ్‌లు చేసిన తర్వాత రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో వానగుట్ట ఈద్గాకు వేలాది మంది ముస్లీంలు తరలివచ్చి రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గా కమిటీ ఆద్వర్యంలో ప్రతియేట ఏర్పాటు చేసిన షామియానాలోని వేదికకు మంత్రి లక్ష్మారెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు హజరయ్యారు. ఈద్గా దగ్గర ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లీం సోదరులను ప్రముఖులు అలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరిలు చిన్నారులను ఎత్తుకుని అప్యాయంగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈద్గా కమిటీ అధ్యక్షుడు రఫీక్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసి తెనీటి విందులో పాల్గొని షిర్‌ఖుర్మాను తాగారు. ఈ సందర్భంగా వానగుట్ట ఈద్గా దగ్గరకు చేరుకున్న మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఆయన జిల్లా ప్రజలకు ప్రత్యేకించి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగలు ఆనాందోత్సహాలతో పాటు ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందింపజేస్తాయని, ముఖ్యంగా రంజాన్, బక్రిద్, దసరా, బోనాల వంటి పండుగలు రాష్ట్రంలోని హిందు, ముస్లింల మధ్య భక్త్భివాన్ని, సోదర భావాన్ని కలగజేస్తాయని తెలిపారు. జిల్లాలోని ముస్లింలందరు రంజాన్ పండుగను ఆనాందోత్సహాలతో జరుపుకోవాలని, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ శ్రీదేవి, జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జాయింట్ కలెక్టర్ రాంకిషన్, అదనపు జాయింట్ కలెక్టర్ బాలాజిరంజిత్ ప్రసాద్, మాజి మంత్రి చంద్రశేఖర్, మాజీ శాసనమండలి సభ్యులు జగధీశ్వర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, డిఎస్పీ కృష్ణమూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్ని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.