మహబూబ్‌నగర్

ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, జూలై 14: జిల్లా అన్ని రంగాలలో వెనుకబడటానికి కారకులైన ప్రతిపక్షాలకు జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హతలేదని, సుదీర్ఘకాలం పదవులను అనుభవించిన వారు జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఎంజికెఎల్‌ఐ ప్రాజెక్టులోని మూడో లిప్టు పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడే ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ప్రజల ఓట్లతో గెలిచి సుదీర్ఘకాలం అధికార పదవులను అనుభవించిన మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి, రాష్ట్ర మాజీ మంత్రులు నాగం జనార్ధన్‌రెడ్డి, డికె అరుణ జిల్లాకు చేసిందేమిలేదని, ఒకవేళ ప్రాజెక్టులను చేపట్టి ఉంటే ఈ ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జిల్లా గురించిగాని, జిల్లా ప్రాజెక్టుల గురించి కాని పట్టించుకోని వీరు నేడు మొసలికన్నీరు కారుస్తున్నారని, వెయ్యి కోట్లు కేటాయిస్తే జిల్లా ప్రాజెక్టులు పూర్తవుతాయని చెబుతున్న వీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిధులు మంజూరు చేయించలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక, ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న ప్రత్యేక చర్యలతో ఒకటిన్నర సంవత్సరాలలో ఎంజికెఎల్‌ఐ ప్రాజెక్టులోని రెండు, మూడు లిప్టుల వద్ద సర్జ్ఫిల్, పంపుహౌస్‌ల నిర్మాణంతోపాటు కరెంటు సబ్‌స్టేషన్ పనులు, కనెక్షన్లు ఇవ్వడం తదితర పనులను యుద్దప్రాతిపదికన చేపట్టడం జరిగిందన్నారు. ఈనెలాఖరులోగా మోటర్ల డ్రైరన్ చేపట్టడం జరుగుతుందని, శ్రీశైలం రిజర్వాయర్‌లోకి నీరువచ్చిన వెంటనే 2,3 లిప్టులను నడిపించి 1.40లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జిల్లాలోని నెట్టంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి కెఎల్‌ఐతోసహా 4.50లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. జూరాల నుంచి ఎందుకు సాగునీరు అందించడంలేదని కొంతమంది అంటున్నారని, జూరాలలో 11 టిఎంసిల సామర్థ్యం మాత్రమే ఉందని, ఇక్కడి నుంచి పిఆర్‌ఎల్‌ఐకు నీరు ఎలా అందించగమని, ఇప్పటికే జూరాల నుంచి బీమా, కోయిల్‌సాగర్, నెట్టంపాడు ప్రాజెక్టులకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అవగాహన లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, జిల్లా ప్రాజెక్టుల నిర్మాణం కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఒకాయన కోర్టుకు వెళ్తారు, మరోకరు దీక్షలు చేస్తామంటారు, ఇంకోకరు రైతులను రెచ్చగొడుతారు ఇదేనా జిల్లా అభివృద్ధికి అందించే సహకారమని ప్రశ్నించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈనెల 21న రాష్టవ్య్రాప్తంగా 10వేల కి.మీటర్ల పొడవున మొక్కలు నాటడం జరుగుతుందని, ఇందులో అందరు భాగస్వాములు కావాలని మంత్రి జూపల్లి పిలుపునిచ్చారు.
ప్రాజెక్టులను అడ్డుకుంటే తిరగబడుతారు : ఎమ్మెల్యే గువ్వల
జిల్లా ప్రాజెక్టులను పూర్తిచేస్తే టిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యంగా సిఎం కెసిఆర్‌కు మంచిపేరు వస్తుందనే ఉద్దేశ్యంతోనే కొంతమంది ఉద్దేశ్యపూర్వకంగా ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఇదే జరిగితే జిల్లా ప్రజలు తిరగబడుతారనే విషయాన్ని వారు గుర్తించుకోవాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రతిపక్షాలను హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ్దతోనే కెఎల్‌ఐ ప్రాజెక్టు సత్వరంగా పూర్తవుతుందన్నారు. ఆగస్టు 15నాటికి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని 75వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.