మహబూబ్‌నగర్

దేశ పునర్నిర్మాణం విద్యార్థులతోనే సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, మార్చి 27: దేశ పున: నిర్మాణం రేపటి పౌరులైన విద్యార్థులతోనే సాద్యం అవుతుందని ఇందుకు గురువులు, తల్లిదండ్రులు అలాంటి విద్యార్ధులను తీర్చి తీద్దాలని సిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ పిలుపునిచ్చారు. కొట్ర శాస్త్ర ఇంటర్ నేషనల్ స్కూల్ రెండవ వార్షికోత్సవం ఉత్సహ భరితంగా ప్రేరణతో సాగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిబిఐ పూర్వపు జెడి లక్ష్మినారాయణ మాట్లాడుతు చదువుకున్నంత మాత్రన సమాజంలోని మానవునిలో సంస్కరం, మార్పు ఎంత మాత్రం రాదని, పరివర్తన తోనే చదువుకు సార్థకత ఏర్పడుతుందన్నారు. నేరాలు, ఘోరాలు నయవంచనాలకు పాల్పడుతున్నది, అధిక శాతం విద్య వంతులేనని అవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు దేశానికి ఉపయోగ పడే పౌరులుగా తయారు చేసే బాద్యత తల్లి దండ్రులు, గురువులపై ఎంతో ఉందన్నారు. మంచి సమాజాన్ని నిర్మించుకునే విధంగా చిన తనం నుంచే ఇతరలకు సహయం చేసే గుణంతో పాటు మంచి భావన , భారత్ పున: నిర్మాణానికి తోడ్పాటునందిచే విధంగా తీర్చి తీద్దాలన్నారు. అటలతోనే మంచి నాయకత్య లక్షణాలు అలవాడుతాయని విద్యార్థులు పేస్‌బుక్, వాట్సాప్స్ లతో మిత్రులను నమ్మి మోసపోవద్దని సంస్కృతిక సప్రాదయాలు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. పాశ్చత్య సంస్కృతితో భారత దేశ ప్రతిష్టకు భగం కల్గిగే ప్రమాదం ఉందని దాని పరిరక్షణకు విద్యార్థులు నడ్డుం బిగించాలని కోరారు. ప్రసుత్తం టివిలతో కుంటుంబ వ్యవస్థ నాశనం అవుతుందని టివిలు చూడటం మాని తల్లి దండ్రులు ఓపికతో పిల్లలతో కలిసి అడటం భోజనాలు చేయడం ప్రొత్సహించడం అలవార్చుకుంటే విద్యార్థులు దుసుపరిణామాలకు దూరవౌతాన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గీతారాణి, పాఠశాల చైర్మన్ శంకరయ్య, డైరెక్టర్ సాయి శంకర్, శ్రీనివాస్, దయకర్‌రెడ్డి, కమకర్, నరేష్, సాయి స్వరూప్, జగదీశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మేదానాయర్, వందేమాతరం రాష్ట్ర కార్యదర్శి మాదవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.