మహబూబ్‌నగర్

పుష్కర ఘాట్ల పనులను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూలై 25: మక్తల్ మండలంతోపాటు నియోజకవర్గంలో జరిగే పుష్కరఘాట్ల పనులు సంబంధిత కాంట్రాక్టర్లు ఈనెలాఖరులోగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని పంచదేవ్‌పాడ్, పస్పులలో జరుగుతున్న పుష్కరఘాట్లతోపాటు చిన్నగోప్లాపూర్ సమీపంలోని భీమా పంపౌజ్‌కు నీరందించే 48వ ప్యాకేజి కాలువ మరమ్మత్తులను ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి పరిశీలించారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో మండలంలోని భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్లను నింపి రైతులకు సాగునీటిని వదలడం జరుగుతుందని అన్నారు. అధికారులు నిర్లక్ష్యం వహించక కాలువ మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టరును ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆలాగే కృష్ణమ్మ నీటి ప్రవాహంతో పుష్కరఘాట్ల పనులకు కొంత ఆటంకం కలిగినప్పటికి ఉన్న పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు. భీమా ప్రాజెక్టు ఏర్పాటులో తన తండ్రి అయిన చిట్టెం నర్సిరెడ్డి కృషి ఎంతో ఉందని, నేడు తన తండ్రి నర్సిరెడ్డి కల నెరవేరబోతుందని తెలిపారు. ఈప్రాంత రైతులకు సాగునీటిని అందించాక వారి కళ్లల్లోని ఆనందం చూడడమే తన ఆనందమని అన్నారు. ఎమ్మెల్యే వెంబడి టిఆర్‌ఎస్ నాయకులు గోపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులున్నారు.