మహబూబ్‌నగర్

ఆగస్టులో వాల్మీకి బోయలపై ప్రభుత్వానికి నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 26: గిరిజనుల స్థితి గతులను అధ్యయానాకి జిల్లాల పర్యటన చేస్తున్నామని ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పలు పథకాల అమలు తీరుతెన్నులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతుందని ఎస్టీ కమిషన్ చైర్మన్ చెల్లప్ప అన్నారు. మంగళవారం జిల్లా పర్యటనలో భాగంగా ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యులు రెవెన్యూ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ చెల్లప్ప మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక సౌకర్యాలను అధ్యయనం చేయడంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 బహిరంగ విచారణలు నిర్వహించినట్లు తెలిపారు. గిరిజనుల స్థితిగతులపై అధ్యయనానికి ఏర్పాటు చేస్ని తమ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా 32 బహిరంగ విచారణలు నిర్వహించిందని ఇందుకు సంబంధించి త్వరలోనే నివేదికలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించినందునా సాధ్యమైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కమిషన్ మహబూబ్‌నగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలలో కొన్ని గ్రామాల్లో ఇంటెన్సివ్ విలేజి స్టడీ కూడా చేసిందని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో అచ్చంపేట, గద్వాల ప్రాంతాలలో కూడా అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో సంపూర్ణ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పథకాల లబ్దిని గిరిజనులందరు సకాలంలో పొందేందకు గిరిజనుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా వీరికి అవగాహన కల్పించి వారి పిల్లలు హాస్టల్‌లో చేరే అవకాశం ఉందని తెలిపారు. చేపలు పట్టే గంగాపుత్రులకు కల్పించే ఆర్థిక సహాయంతో పోలిస్తే బోయలకు అందించే ఆర్థిక సహాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. బోయల పరిస్థితులపై కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామని వాటి నివేదిక కూడా అందిస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి జిల్లాలో గిరిజనుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాల గురించి తెలియజేస్తూ ముఖ్యంగా చెంచుపెంటలోని గిరిజనులతో పాటు మైదాన ప్రాంతంలోని గిరిజనులకు కూడా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత డిసెంబర్‌లో జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందని దీని వల్ల గుడుంబాపైనే ఆదారపడి జీవనం సాగిస్తున్న వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకుగాను 650కి పునరావాసం కింద ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేపట్టామని ఏ జిల్లాలో లేని విధంగా మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని 80 శాతం సబ్సిడీ 20 శాతం బ్యాంకుల సహకారంతో ఆర్థిక సహయాన్ని 640కి గాను 323 మంది ఎస్టీలే ఉన్నారని తెలిపారు. లబ్ధిదారుల కోరిక మేరకు వారు కోరుకున్న రంగాలలో ఉపాధి కల్పిస్తామని దింతో పాటు భూమి కొనుగోలు, వ్యవసాయ సబ్సిడీ విత్తనాలు, ఆసరా పించన్లు అన్ని ప్రభుత్వ పథకాల కింద లబ్ధికల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు జగన్నాథరావు, ఎచ్‌కె నాగులు, ఎజెఎసి బాలజి రంజిత్‌ప్రసాద్, డిఆర్‌ఓ భాస్కర్, జడ్పిసిఇఓ లక్ష్మినారాయణ, డిటిడబ్ల్యుఓ సంధ్య, బిసి కార్పొరేషన్ ఈడి రాజేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి సర్వయ్య, స్పెషల్ కలెక్టర్ వనజాదేవి తదితరులు పాల్గొన్నారు.