మహబూబ్‌నగర్

ఆల్మట్టి నుంచి 30వేల క్యూసెక్కుల నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జూలై 27: ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద నీటి తాటికి స్వల్పంగా పెరుగుతుంది. బుధవారం సాయంత్రం నాటికి ఆల్మట్టి జలాశయంలో 519.60 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 27,920 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 30వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయంలో 123.081 టిఎంసిల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయంలో 491.960 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 28,965 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 26,880 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణపూర్ జలాశయంలో 31.60 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల జలాశయంలో 318.38 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 18వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 27,617 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల జలవిద్యుత్‌కు 24వేల క్యూసెక్కులు, సమాంతర కాలువకు వెయ్యి క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 317 క్యూసెక్కులు, జూరాల కుడి, ఎడమ కాలువకు 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి...
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జూరాల జలవిద్యుత్ కేంద్రం మూడు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.
ప్రాజెక్టు నుంచి 24వేల క్యూసెక్కుల వరద నీటిని వినియోగించుకొని మూడు యూనిట్ల ద్వారా 170 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలపై ప్రభుత్వం స్పందించాలి
దామరగిద్ద, జూలై 27: నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతల పథకం సాధనకై చేపట్టిన మహాపాదయాత్ర బుధవారం దామరగిద్ద మండలంలో కొనసాగింది.
ఈ సందర్భంగా మండల పరిధిలోని ముక్కన్‌పల్లి, కాన్‌కుర్తి, లోకుర్తి, మల్‌రెడ్డిపల్లి, మొగల్‌మడ్క గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం సాధనకై ఆగష్టు 1వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగసభకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టేలా సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈ ప్రాజెక్టు సాధనతో డివిజన్ కేంద్రంలోని 30 మండలాల్లోని రైతులు సస్యశ్యామలంగా తమ భూములను సాగుచేయవచ్చని అన్నారు. నియోజకవర్గాల అభివృద్ద్ధి పేరుతో టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఈ రోజు ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడకపోవడం విడ్డురమని అన్నారు. ఎత్తిపోతల పథకం సాధించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగురావు నామాజీ, ప్రాజెక్టు జల సాధన సమితి కన్వీనర్ అనంతరెడ్డి, అకిలపక్ష నాయకులు సరఫ్ కృష్ణ, కాశీనాథ్, ఉదయ్, వెంకటరాంరెడ్డి, భీమయ్యగౌడ్, నరసింహరెడ్డి, చెన్నప్ప, మల్లిఖార్జున్ , గోపాల్ తదితరులు పాల్గొన్నారు.