మహబూబ్‌నగర్

మీ పనితీరు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూర్, జూలై 28: కృష్ణానదికి వరద రావడంతో దిగువ జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ జూరాల వద్ద జెన్‌కో డైరెక్టర్ కెఆర్‌కె రెడ్డి ఆధ్వర్యంలో రెండు యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దిగువ జూరాల వద్ద నిర్మిస్తున్న జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 2007 ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు. రూ.1200 కోట్ల నిధులతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా గత సంవత్సరం రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగా ఈ ఏడాది మరో రెండు యూనిట్ల ద్వారా ఉత్పత్తిని ప్రారంభించి మిగతా రెండు యూనిట్ల ద్వారా ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని జెన్‌కో డైరెక్టర్ కెఆర్‌కె రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులలో భాగంగా దిగువ జూరాల వద్ద నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో మొట్టమొదటి ప్రాజెక్టుగా ఆయన వెల్లడిస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతానికే విద్యుత్‌ను వాడుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఆగస్టు చివరి నాటికి పూర్తి స్థాయిలో ప్రారంభమైన తరువాత తెలంగాణ ప్రాంత రైతాంగానికి, వినియోగదారులకు విద్యుత్‌ను చౌకగా అందించేందుకు జెన్‌కో సంస్థ చర్యలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. గురువారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు, జెన్‌కో అధికారులను ప్రత్యేకంగా అభినందించారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జెన్‌కో ఎస్‌ఇ ఆనంద్, ఎఇలు వెంకటరమణరావు, భాస్కర్, జెన్‌కో సిబ్బంది పాల్గొన్నారు.