మహబూబ్‌నగర్

ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్‌గల్, జూలై 28: పాలమూరు జిల్లాలోని భీమ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కెఎల్‌ఐ, జూరాల ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని పంచాయిత్‌రాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల పరిదిలోని కేతేపల్లి, గోపల్‌దినే్న, చింతకుంట, మాందాపూర్, మల్లాయిపల్లి గ్రామాల వెంట ఉన్న భీమ, జూరాల కాలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రన్తుతం పాలమూరు జిల్లాలో కాలువల ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించటం జరుగుతుందన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి శాతం పెరిగిన వెంటనే అగస్టు నెలాఖరు వరకు కెఎల్‌ఐ నుండి జొన్నలబోగడ రిజర్వాయార్ ద్వారా 40గ్రామాల రైతులకు సుమారుగా లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరత ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీటిని సరఫరా చేస్తామన్నారు. సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నరన్నారు. ప్రతి ఇంటికి వంటగ్యాస్, త్రాగునీరు, అందించడం జరుగుతుందని, గ్రామాలలో బిటి రోడ్ల పనులు ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. కాలువ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు ఈ సందర్బంగా భీమా అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమా హైలెవల్, లోలెవల్ కెనాళ్ల ద్వారా అన్ని చెరువులను, కుంటలను నీటితో నింపుతామన్నారు. మక్తల్‌లో భీమా ప్రాజుక్టు ట్రాయల్న్ విషయంలో సిఇపై టిడిపి, బిజెపి నేతలు దాడి చేయడం తగదన్నారు. అధికారులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మంత్రి వెంట ఎంపిపి వెంకటేష్ నాయుడు, జడ్పీటీసి రవి, విండోఛైర్మన్ బాల్‌రెడ్డి,విండోవైస్ చైర్మన్ బాస్కర్‌యాదవ్, భీమా అధికారులు ఉమాపతిరావు, కిరణ్, ఆంజనేయులు, నాయకులు, వివిద శాఖల అధికారుల పాల్గొన్నారు.