మహబూబ్‌నగర్

ముమ్మరంగా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయిలకొండ, ఆగస్టు 2: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం మండలంలో ఉద్యమంలా సాగుతుంది. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి తన స్వంత మండలమైన కోయిలకొండకు హరితహరంలో జిల్లాలో ప్రత్యేక స్థానం ఉండాలని హరితహారంలో ప్రతీ అధికారి ప్రత్యేక శ్రద్ధ్ద పెట్టాలని కోరడంతో గ్రామాల్లో అధికారులు, హరితహారంలో మండల అధికారులు ప్రత్యేక శ్రద్ధ్ద వహిస్తున్నారు. గత వారం హరితహారంపై మండల వివిద శాఖల అధికారులతో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి రివ్యూ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధిహమీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టేంట్‌లు హరితహారంపై శ్రద్ద్ధ వహించడం లేదని ఆగస్టు10లోపు ప్రతి గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ 10 వేల మొక్కలు నాటాలని లేదంటే వారిని తొలగిస్తామని మండల అధికారులు ఆదేశించారు. మండల పరిషత్ అధికారి చంద్రశేఖర్ మండలంలో మొదటి నుండి హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్‌లను, ఫీల్డ్ అసిస్టేంట్‌లను ఉత్సాహపరుస్తూ ఉరుకులు, పరుగులు తీయిస్తున్నారు. ఎంపిడిఓ శ్రద్ద్ధ వల్లే ప్రస్తుతం హరితహారం చాలావేగంగా సాగుతుంది. మండంలోని తహశీల్దార్ గోపాల్‌తో పాటు ఎక్సైజ్ అధికారులు, ఐబి శాఖ అధికారులు సైతం హరితహారం కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మండల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే తమ టార్గెట్ పూర్తి చేశారు. మండలంలో అటవీ విస్తీర్ణం పెద్ద ఎత్తున ఉన్నా అటవీ అధికారులు మాత్రం హరితహారంలో పాల్గొనకపోవడంపై వివిద గ్రామాల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఈత మొక్కలను చెరువుల కట్టలపై నాటడం జరుగుతుంది. ప్రతీ గ్రామంలో 40 వేల మొక్కలు నాటాల్సి ఉండగా మండల అధికారులు తము నిర్థేశించుకున్న లక్ష్యాన్ని చెరుకోవడానికి దగ్గరలో ఉన్నామని చెబుతున్నారు. ఇక మండంలోని కొన్ని గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టేంట్‌లు మాత్రం మండల అధికారులు ఎంత పనిచేస్తున్నా వారికి మాత్రం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని సమాచారం. ఇక మరో ఎనిమిది రోజుల్లో మండల అధికారులకు క్షేత్ర సిబ్బంది సహకనరిస్తే ఎమ్మెల్యే లక్ష్యం పూర్తి అయ్యో అవకాశాలు ఉన్నాయి . అదేవిధంగా మనికొండ గ్రామంలోని ఊరచెరువు కట్టపై 850 ఈత చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో ఐబి ఎఇ సుజాత, సర్పంచ్ అంజనేయులు పాల్గొన్నారు.