మహబూబ్‌నగర్

ఆలయాలను దర్శించుకున్న ఎక్సైజ్ కమిషనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంపూర్, ఆగస్టు 2: అష్టాదశ శక్తీపీఠాలలో 5వ శక్తిపీఠమైన శ్రీ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను మంగళవారం ఎక్సైజ్ కమీషనర్ చంద్రవదన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ సాంప్రదాయ పద్దతిలో స్వాగతం పలికారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి సన్నిదిలో ప్రత్యేక పూజలు, చండి హోమాలలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రాలతో సత్కరించారు. అమావాస్య కావడంతో భక్తులు అధిక సంఖ్యలో శ్రీ జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయాలు కిక్కిరిసాయి. భక్తులు 92 మంది అమ్మవారి యాగశాలలో చండి హోమాలను నిర్వహించారు. ఆయనతో పాటు ఎక్సైజ్ సిఐ మహబూబ్‌అలీ, ఎస్‌ఐ అనంతయ్య, సిబ్బంది ఉన్నారు.