మహబూబ్‌నగర్

ఇంజనీర్లపై దాడి జరిగినా స్పందించని కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఆగస్టు 2: భీమా ప్రాజెక్టు లిఫ్టు-2 వద్ద ఇరిగేషన్ చీఫ్ ఇంజనీయర్ ఖగేందర్, ఎస్‌ఇ భద్రయ్య, ఇఇ ఉదయ్‌శంకర్‌లపై జరిగిన దాడి సంఘటనలో సమాచారం ఇచ్చినప్పటికి కలెక్టర్ స్పందించకపోవడం బాధాకరమని, తాను కూడా ఓప్రభుత్వ అధికారన్నది ఎందుకు గుర్తుకు రాలేదని తెలంగాణ రాష్ట్ర ఇంజనీయర్స్ జెఎసి అధ్యక్షుడు వెంకటేషం అన్నారు. సమాచారం ఇచ్చినా స్పందిచక పోయినా పైగా ఇంజనీర్లపై కలెక్టర్ అభాండాలు మోపడం అన్యాయమన్నారు. ఇరిగేషన్ అధికారులపై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ నుండి మక్తల్‌కు ఇంజనీర్లు భారీ కారు ర్యాలీ నిర్వహించారు. భీమా లిప్టు-2 వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంజనీర్లపై దాడిచేసిన రాజకీయ గుండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు యంత్రాంగం ఉదాసీనతవల్లే దాడి సంఘటనలో నలుగురు నిందితులకు ఆదేరోజు బేయిల్ లభించడం పోలీసు యంత్రాంగం పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఆధునిక దేవాలయాలుగా అభివర్ణిస్తున్న ప్రాజెక్టుల నిర్మాణంలో తమ ఇంజనీయర్లు రాత్రి, పగలు అన్న తేడా లేకుండా కష్టించి పనిచేస్తుంటే కొందరు పనిగట్టుకొని దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను నివారించేందుకై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. దాడిచేసిన నిందితులు పక్కా తెలంగాణ ద్రోహులేనని అన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి స్పందించకపోవడం బాధాకరం...
మక్తల్‌లో ఇంజనీయర్లపై దాడులు జరిగి వారం రోజులు కావస్తున్నా ఈజిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు తమపై దాడిని ఖండించకపోవడం చాలా బాధాకరంగా ఉందని వెంకటేషం అన్నారు. జిల్లా యంత్రాంగానికి ఏచిన్న సమస్య వచ్చిన కాపాడవలసిన మంత్రి దాడి జరిగినా స్పందించకపోతే తాము ఎలా పనిచేయగలమని, తమకు భధ్రత ఎక్కడుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన మేరకు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీటిని అందించడమే తమ ముందున్న లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం జరుగుతుందని అన్నారు. కానీ తమపై దాడిని ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, అంతవరకు తమ ఆందోళన విరమించబోమని వారు హెచ్చరించారు.