మహబూబ్‌నగర్

కృష్ణా పుష్కరాలకు 434 ప్రత్యేక బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 4: కృష్ణా పుష్కరాల సందర్భంగా తెలంగాణ ఆర్టీసి 434 ప్రత్యేక బస్సులను జిల్లాలో నడపనుందని మహబూబ్‌నగర్ ఆర్టీసి ఆర్‌ఎం వినోద్‌కుమార్ వెల్లడించారు. కృష్ణా పుష్కరాల్లో ఆర్టీసి సేవలపై గురువారం వివిధ డిపోల మేనేజర్లతో పాటు కార్మిక సంఘాల నేతలతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆర్‌ఎం వినోద్‌కుమార్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాల సందర్భంగా టిఎస్ ఆర్టీసీ మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల సౌకర్యార్థంతో పాటు హైదరాబాద్, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 27 పుష్కరఘాట్లకు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందన్నారు. ఈ పుష్కరాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 294 రీజియన్ బస్సులు, 140 ఇతర రీజియన్ బస్సులతో కలిపి 434 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. భక్తుల రద్దీని బట్టి అవసరం ఉన్న పుష్కర ఘాట్లకు అదనపు బస్సులను నడపడానికి కూడా సిద్ద్థంగా ఉన్నామన్నారు. ఇంతేకాకుండా రంగాపూర్, అచ్చంపేట, కృష్ణా ఘాట్ల వద్ద ఆర్టీసి బస్సుల పార్కింగ్ స్థలానికి, స్నానఘట్టలకు మధ్య దూరం ఎక్కువగా ఉండడం వలన షటిల్ సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తుల సౌకర్యార్థం పుష్కర ప్రత్యేక బస్సుల సమగ్ర సమాచారం కోసం అన్ని బస్టాండ్లలో, ఘాట్ల దగ్గర మై హై హెల్ప్ యు బూత్‌లను ఏర్పాటు చేసి సుశిక్షుతులైన సిబ్బందిని బూత్‌లలో నియమించడం జరుగుతుందన్నారు. ప్రయాణ సౌకర్యార్థం ముఖ్యమైన ప్రదేశాలైన కొత్తకోట, బీచుపల్లి, రంగాపూర్, ఆత్మకూర్‌లలో రిలీప్ వ్యాన్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని బేస్ క్యాంప్‌ను పెబ్బేర్‌లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటితో పాటు జాతీయ రహదారి మీదుగా జడ్చర్ల, పెబ్బేర్‌లలో రెండు మొబైల్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 434 బస్సుల ఆపరేషన్‌కు భక్తులకు ఇబ్బంది ప్రయాంతో పాటు కావల్సిన సమాచారం అందించే సర్వీసుల పర్యావేక్షణకై జిల్లాలోని అధికారులు, సిబ్బందితో పాటు రాష్ట్రంలోని ఇతర రిజియన్ల నుండి ఇద్దరు రిజినల్ మేనేజర్ స్థాయి అధికారులు, ఆరుమంది డివిజన్ స్థాయి అధికారులు, 12 మంది డిపో మేనేజర్ స్థాయి అధికారులతో పాటు 102 మంది అదనపు సిబ్బందిని కూడా నియమించడం జరిగిందన్నారు. ఉత్తర తెలంగాణ నుండి కూడా కృష్ణా పుష్కరాలకు మహబూబ్‌నగర్ జిల్లాకు భక్తులు రానున్నడంతో హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్ నుండి రంగాపూర్ పుష్కరఘాట్ వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటిని రంగారెడ్డి రిజినల్ మేనేజర్ పర్యావేక్షిస్తారని వెల్లడించారు. అలంపూర్ జోగులాంబ దగ్గర గల గుందిమల్ల పుష్కరఘాట్‌కు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కొల్లాపూర్ నుండి సోమశిల పుష్కరఘాట్‌కు 60, మహబూబ్‌నగర్ నుండి బీచుపల్లికి 50, షాద్‌నగర్ నుండి బీచుపల్లికి 10, కొత్తకోట నుండి నందిమల్ల జూరాలకు 10, వనపర్తి, పెబ్బేర్‌కు 15, మమబూబ్‌నగర్ నుండి శ్రీశైలంకు 5, మహబూబ్‌నగర్ నుండి కృష్ణాకు 5, కల్వకుర్తి నుండి శ్రీశైలంకు 12, రాయిచూర్ నుండి పెత్తచింతరేవుల వరకు 15, దోమలపెంట నుండి పాతాళగంగా వరకు 10 బస్సులతో పాటు ఇతర పుష్కర ఘాట్లకు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.