మహబూబ్‌నగర్

పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 27: గ్రామ గ్రామాలన పార్టీని బలోపేతం చేద్దామని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచారి తెలిపారు. ఆదివారం జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా పధాదికారుల సమావేశానికి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ కేంద్రంలో రెండేళ్ల నరేంద్రమోదీ పాలనలో జరుగుతునన్న అభివృద్ధి దేశ వ్యాప్తంగా ప్రసంశలు అందుతున్నాయని కాంగ్రెస్ పార్టీకి దేశంలో నూకలు చెల్లుతున్నాయనే భయం మరింత పెరిగిందని భవ్యిషత్‌లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావడం కలగానే మిగలన్నుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచిందని అందుకే కేంద్ర బడ్జెట్‌లో రైతులకు అత్యంత ప్రధాన్యత ఇవ్వడం జరిగిందని అన్నారు. రైతులు వాడే యూరియా వేపపూతతో చేయడం వలన బ్లాక్ మార్కెట్ తగ్గి రైతులకు అందుబాటులోకి వచ్చిందని అన్నారు. గ్యాస్ కనెక్షన్లు బీదవారికి అందించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుదని అన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తుృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు ఏప్రిల్ 2వ తేదీ వరకు పూర్తి చేయాలని అన్నారు. ఏప్రిల్‌లో పార్టీ జిల్లా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. జిల్లాలో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా జిల్లా అధ్యక్షుడిగా దాదాపు నాలుగేళ్ల పాటు సేవలందించిన రంతంగ్‌పాండురెడ్డిని బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకుడు శాంతికుమార్, ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు బాల్‌రాజ్, శ్రీవర్ధన్‌రెడ్డి, ప్రబాకర్‌వర్ధన్, సత్యం, శ్రీనివాస్‌రెడ్డి, రాంమోహన్, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.