మహబూబ్‌నగర్

తెలంగాణకు జోగులాంబ అమ్మవారు తలమానికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 6: తెలంగాణకు ఐదవశక్తి జోగులాంబ అమ్మవారు తలమానికమని కలెక్టర్ టికె శ్రీదేవి తెలిపారు. శనివారం కృష్ణా పుష్కరాలపై అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశానికి కలెక్టర్, ఎస్పీలు ముఖ్యఅతిథులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలు సజావుగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తేనే లక్షాలాది మంది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగవన్నారు. జిల్లాలోని దాదాపు 10 పుష్కర ఘాట్లకు భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. జోగులాంబ అమ్మవారికి 10కిలో మీటర్ల దూరంలో గుందిమళ్ల పుష్కరఘాట్ ఏర్పాటు చేయడం జరిగిందని శక్తిపీఠం తుంగభద్రనది తీరాన ఉన్నప్పటికిని అమ్మవారిని శక్తిని ప్రపంచానికి చాటి చెప్పడానికి గుందిమళ్ల పుష్కరఘాట్‌కు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా గుందిమళ్ల పుష్కరఘాట్‌కు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు.
ఇప్పటి వరకు అధికారులు ఎంతో శ్రమించారని ఇకమీదట మరో ఆరురోజుల పాటు చేసే పని చాలా ముఖ్యమైందని 12వ తేదీ నుండి ప్రారంభమయ్యే పుష్కరాలు 23వ తేది వరకు శ్రమించాల్సి వస్తుందన్నారు. 12 రోజులు ప్రతి వ్యక్తి తమ కుటుంబంలో ఎదో శుభకార్యం జరుగుతుందనే భావనతో ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లాలోని ఏడు పుష్కర ఘాట్ల దగ్గర మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, వి ఐపి పాస్‌ల విషయంలో రెండు మూడు రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని వెల్లడించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఘాట్ల వద్ద ప్రత్యేక అధికారులు అన్ని శాఖలతో, వలంటీర్లతో సమన్వయంగా ముందుగా వెళ్లాలన్నారు. ఘాట్ల వద్ద మిగిలిన ఏర్పాటు పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కృష్ణానది వరద వస్తున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ట్రాఫీక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ ఘాట్లకు అతి సమీపంలోకి వాహనాలను అనుమతి లేదని కొద్ది దూరంలోని పార్కింగ్ స్ధలాల నుండి ఘాట్లకు వెళ్లాస్సిందేనని ముఖ్యంగా ఆయా ఘాట్ల పరిధిలోని డిఎస్పీలు అప్రమత్తంగా ఉంటూ ఇతర జిల్లాల నుండి బందోబస్తుకు వస్తున్న పోలీసులను సమన్వయం చేసుకోని ట్రాఫీక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పుష్కరాల ఏర్పాట్లు ఎంత ముఖ్యమో బందోబస్తు కూడా అంతే ముఖ్యమని పుష్కరాలు సజావుగా, ప్రశాంతంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీకలమని అన్నారు. పోలీసు బలగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి భక్తులకు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో జెసి రాంకిషన్, అదనపు జెసి రంజిత్ ప్రసాద్, జడ్పీ సిఇఓ లక్ష్మీనారాయణ, డిఆర్‌డిఏ పిడి నాయక్, డిఎఫ్‌ఓ మూర్తి, డ్వామా పిడి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గుళికల మందుకు 25 కృష్ణజింకలు మృతి
పెబ్బేరు, ఆగస్టు6: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల పరిధిలోని గుమ్మడం గ్రామ శివారులోని కృష్ణనది తీర ప్రాంతంలో గులికల మందుకు 25 కృష్ణ జింకలు బలైన సంఘటన చోటు చేసుకుంది. ఫారెస్టురెంజ్ ఆఫీసర్ అబ్రహం తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున గులికల మందు వేసిన మొక్కజొన్న చెనును 25 కృష్ణజింకలు మేయడంతో అవి అక్కడికక్కడే మృతి చెందాయి. గుమ్మడం గ్రామానికి చెందిన పురుషోత్తం, భీరయ్య అనే రైతులు కృష్ణనది తీరంలో అక్రమంగా మొక్కజొన్న పంటలను వేశారు. కృష్ణనదిలో నీరు ఉదృతంగా రావడంతో శ్రీశైలం బ్యాక్ వాటార్‌లో అడవుల నుండి జింకలు బయటికి వచ్చాయి. నది ఒడ్డునే ఉన్న మొక్కజొన్న చెనులో మేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని ఆయన తెలిపారు. వెటర్నరీ డాక్టర్ మల్లేష్ పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటన వివరాలను పై అధికారులకు తెలుపనున్నట్లు ఆయన చెప్పారు. నది తీర ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా సాగు చేయడం తగదని దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా తహశీల్ధార్ దత్తాత్రి మాట్లాడుతూ ఈ భూమి ప్రభుత్వానికి చెందిందని నీటి మునక పొలం కావడంతో వారు పంటలు వేసుకున్నారన్నారు. దీనిపై అధికారులకు నివేదిక అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వన్యప్రాణాలను రక్షించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నప్పటికి అదే విధంగా రాష్ట్ర జంతువు అయిన కృష్ణజింకను ఎన్నుకోవడం ఈ సంఘటన తెలంగాణ ప్రజలను విషాధానికి గురి చేసింది. పోస్టుమార్టం నివేదికలను అధికారులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు. వారి వెంట ఎఫ్ ఎస్ ఓ, వీ ఆర్ ఓలు తదితరులు ఉన్నారు.