మహబూబ్‌నగర్

జోగులాంబను దర్శించుకోవడం మహాభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 12: పనె్నండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాల్లో పుష్కర స్నానం చేసి దేశంలోని అష్టదశ శక్తి పీఠాల్లో ఒకటైనా అలంపూర్ జోగులాంబ దేవతను దర్శించుకోవడం మహాభాగ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ సమీపంలోని గొందిమల్ల గ్రామం దగ్గర ఉన్న జోగులాంబఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించి కృష్ణా పుష్కరాలను సిఎం ప్రారంభించారు. అనంతరం అలంపూర్‌లోని హరిత అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలు ప్రారంభానికి మహబూబ్‌నగర్ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. పుష్కరాలను ముహుర్త సమయంలోనే ప్రారంభించామని పూజారులు, శాస్తల్రు చెబుతున్నందున ముందురోజురాత్రే అలంపూర్‌లో బస చేయడం జరిగిందని తెలిపారు. పుష్కరాల సందర్భంగా ముందుగా దేవునికి స్నానం, యతేంద్రుల స్నానం, పాలకుల స్నానం ఆ తర్వాత సామాన్య ప్రజల స్నానం ఉంటుందని పుష్కర స్నానం గురించి కెసిఆర్ వివరించారు. తాను అలంపూర్ రావడం అంతా జోగులాంబతల్లి కృష్ణవేణేనని పెర్కోన్నారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జోగులాంబ అమ్మవారి దయవల్ల కృష్ణా పుష్కరాలు విజయవంతంగా జరగాలని సిఎం ఆకాంక్షించారు. గొందిమళ్ల పుష్కరఘాట్‌కు జోగులాంబఘాట్‌గా నామకరణం చేసి కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పుష్కర స్నానం తర్వాత ఐదశశక్తిపీఠంలోని దేవతను దర్శించుకోవడం దేశంలో ఎక్కడ లేదని ఇక్కడ మాత్రమే ఉందని తెలిపారు. అందువల్లనే ఈ అవకాశం అలంపూర్‌కు మహాభాగ్యమని చెప్పారు. అలంపూర్ ఆలయాలను పునరుద్దరించుకోవల్సిన అవసరం ఉందని ఇందులో భాగంగా ఈ విషయంపై ప్రధానమంత్రితో జోగులాంబ శక్తి,విశిష్టతల గురించి చర్చిస్తామన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కృష్ణవేణి పోస్టల్ స్టాంపులను ముఖ్యమంత్రి కెసిఆర్ అవిష్కరించారు.