మహబూబ్‌నగర్

కృష్ణమ్మ మహాదర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఆగస్టు 17: కృష్ణమ్మ మహాదర్శనం చేసుకుంటున్న భక్తులు పునితం అవుతున్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా బుధవారం ఆరవ రోజు కృష్ణా పుష్కరాలు జిల్లాలో వైభవంగా కొనసాగాయి. గత ఆరు రోజులుగా జరుగుతున్న కృష్ణా పుష్కరాల సందర్భంగా 66 లక్షలకు పైగా భక్తులు పుష్కర స్నానం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయ. కృష్ణానది తీరాన భక్తపరవశం వెల్లివిరిసింది. తంగిడి నుండి మొదలుకుని పాతాళగంగా వరకు నది పొడవున ఎటుచూసిన భక్తుల రద్దీ కనబడింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 52 పుష్కర ఘాట్లకు గాను ఎనిమిది పుష్కర ఘాట్లకు కృష్ణమ్మ పరవళ్లు తగ్గడంతో అటు వచ్చే భక్తులను దారి మళ్లించి కృష్ణమ్మ పరవళ్లు తాకిన పుష్కరఘాట్లకు భక్తులు పుణ్యస్నానాలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆరవ కృష్ణా పుష్కరాలు జిల్లాలో విజయవంతం అయ్యాయి. తెల్లవారుజామున 5 గంటలకు ఆయా పుష్కర ఘాట్ల ఇన్‌చార్జిలు కృష్ణవేణికి హరతీ ఇచ్చి పుష్కర స్నానం చేశారు. సాయంత్రం కూడా ముగింపు హరతీని ఇచ్చారు. ఈ సందర్భంగా తంగిడి పుష్కర ఘాట్ దగ్గర బుధవారం ప్రత్యేకంగా 216 బ్రహ్మణ కుటుంబాలు ఏకకాలంలో పుష్కర స్నానం ఆచరించారు. అదేవిధంగా కృష్ణా పుష్కర ఘాట్‌కు ఊహించని రితీలో భక్తులు తరలివచ్చారు. కృష్ణా రైల్వే బ్రిడ్జి దగ్గర కృష్ణవేణి పరవళ్లు తొక్కుతుండడం నది ప్రవాహం ఉండడంతో భక్తులు కృష్ణాఘాట్‌కు రావడంతో భక్తుల తాకిడి ఎక్కువ అయ్యింది. ఉల్లాసంగా ఉత్సహంగా యువతులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. నదీ ప్రవాహం ఉండడంతో పోలీసులు నదిలో మరబోట్లను వేసుకుని భద్రత నిర్వహించారు. కృష్ణా పుష్కర ఘాట్‌కు రైల్వే సౌకర్యం ఉండడంతో కర్ణాటక, మహారాష్టక్రు సంబంధించిన భక్తులు కూడా వేలాదిగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. పస్పుల పుష్కర ఘాట్‌కు జనం పోటెత్తారు. దారులన్ని కృష్ణమ్మ వైపు రావడంతో ఇక్కడ దత్తాత్రేయుడి దేవాలయం కిటకిటలాడింది. నది అగ్రహారంలో భక్తులు జనసంద్రంగా మారారు. పెద్ద చింతరేవుల దగ్గర భక్తుల కోలాహలం నెలకొంది. ఇక్కడ ఊర్ధముఖ ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేకంగా కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా ప్రజలు తరలివచ్చి పుణ్యస్నానాలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. బీచుపల్లి దగ్గర పుష్కర ఘాట్‌ను పలువురు ప్రముఖులు సందర్శించి ఏర్పాట్లపై ఆరా తీశారు. బీచుపల్లికి వరదలా భక్తులు తరలివచ్చారు. అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల రద్ది యదావిధిగా కొనసాగుతుంది. అలంపూర్ పుష్కరఘాట్‌కు అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారు. జోగులాంబదేవి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. పాతాళగంగాలో భక్తుల రద్ది కొనసాగింది. సోమశిలకు తరలివస్తున్న భక్తులు ఆశేషంగా ఉన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ పెరగడం ఇక్కడ కృష్ణమ్మ సోయగాలు రమణీయంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఆరవరోజు అలంపూర్‌కు 500 మంది పోలీసు బలగాలను ప్రత్యేకంగా పంపించారు. ఐజి శ్రీనివాస్‌రెడ్డి, డి ఐజి అకున్‌సబర్వాల్, ఎస్పీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ శ్రీదేవి అలంపూర్‌లో ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఏది ఎమైనప్పటికిని జిల్లాలో కృష్ణా పుష్కరాలు విజయవంతంగా కొనసాగుతూ లక్షాలాది మంది పుష్కర స్నానం చేస్తూ పునితులవుతున్నారు.