మహబూబ్‌నగర్

పంటలను పరిశీలించిన వాతావరణ శాఖాధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినేపల్లి, సెప్టెంబర్ 1: మండలంలోని వట్టెం,బిజినేపల్లి, పాలెంలలో వాతావరణ శాఖాధికారి కమలాకర్‌రెడ్డి బృందం గురువారం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితులలో మొక్కజొన్నకు వందశాతం నష్టం వాటిల్లిందని, ఇటీవల కురిసిన వర్షంతో పత్తి, కంది పంటలు కోలుకున్నాయని, మున్ముందు వర్షాలు కురిస్తేనే ఈ పంటలలో 50శాతం దిగుబడి వస్తుందన్నారు. పరిశీలించిన పంటల నివేదికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డిఎస్‌వో నాగార్జునగౌడ్, ఎఎస్‌వో స్వామి, ఎఇఒ మధుసూధన్‌రెడ్డి ఉన్నారు.