మహబూబ్‌నగర్

చదువుతోపాటు పోటీ పరీక్షల్లో రాణించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: విద్యార్థులు చదువుతో పాటు పోటీ పరీక్షల్లో కూడా రాణించేలా అకాడమిక్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి విద్యాశాఖ అధికారులకు సూచించారు. మంగళవారం రెవెన్యూ సమావేశ మందిరంలో విద్యాశాఖ కార్యక్రమాలపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్య, ఇంటర్మిడియేట్ విద్య, డిగ్రీ విద్యతో పాటు ఒకేషనల్ విద్యలో విద్యార్థులు చదువుతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించే పోటీల్లో తట్టుకుని నిలబడేలా ప్రణాళిక ఉండాలన్నారు. జిల్లాలో ఫార్మారంగం వస్తున్నందున ఎక్కువ మొత్తంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించే అస్కారం ఉందన్నారు. అందువల్ల విద్యార్థులను పోటీ పరీక్షలకు, సమకాలిన పరిస్థితులకు అనుకూలంగా తీర్చిదిద్దాలని అన్నారు. కెజి నుండి పిజి వరకు విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నందున ఆయా స్థాయిలలో ప్రవేశాలతో పాటు కరికులం, అకాడమిక్ క్యాలెండర్, పాఠ్యప్రణాళిక వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు అలాగే ఇంటర్, డిగ్రీలలో విద్యార్థుల వివరాలను సబ్జెక్టుల వారిగా తమకు సమర్పించాలని కోరారు. ఈ విషయంపై త్వరలో మరో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నారాయణపేట ప్రాంతంలో వలసల కారణంగా విద్యార్థుల నమోదు తక్కువగా ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా జిల్లా అంతట వర్తిస్తాయని ఒక ప్రాంతంలో ప్రత్యేకించి నమోదు తక్కువగా ఉన్నందున ఇతర అంశాలపై దృష్టి కేంద్రికరించాలని తెలిపారు. గత సంవత్సరంతో పోలీస్తే ఈ సంవత్సరం పదవ తరగతిలో 6వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ వనజాదేవి, ఆర్విఎం పిఓ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

బూత్ స్థాయి నుండి పార్టీని
బలోపేతం చేద్దాం
* 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్దాం
* ప్రజల్లో తెరాసకు వ్యతిరేకత వచ్చేసింది
* బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని అందుకు జిల్లాలోని ముఖ్యమైన నాయకులు కసరత్తు చేయాలని బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపికి మంచి భవిష్యత్తు ఉందని ఎన్ని జిల్లాలు ఏర్పడ్డ అది బిజెపికి మంచే జరుగుతుందని వెల్లడించారు. జిల్లాల విభజనతో పాటు మండలాల విభజన కూడా జరుగుతుండడంతో పార్టీకి మంచి పట్టు సాదించే అవకాశం ఉందని ఇందుకు గాను నాయకులు బూత్ స్థాయి నుండి సంస్థాగతంగా బలోపేతం కావాలన్నారు. నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నాయకులు ఉన్నారని వారు బూత్ స్థాయి నుండి పార్టీని నిర్మాణం చేస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాదించవచ్చన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయం బిజెపియేనని ఇందులో సందేహ పడాల్సిన అవసరం లేదన్నారు. 2019 ఎన్నికల నాటికి ఓ బలియమైన శక్తిగా ఎదుగుతామని అధికారంలోకి తప్పకుండా వస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాను మూడు జిల్లాలుగా విభజిస్తుండడం ఇలాంటి అంశం ఎలా ఉన్న అన్ని జిల్లాల్లో బిజెపి బలోపేతం అవుతుందన్నారు. ప్రజల్లో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకత వచించిందని ఇక ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపెతం చేసుకుంటే తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా డబ్బా కొట్టుకుంటుందని దీనిని ప్రతి నాయకుడు తిప్పి కొట్టి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై విసృత్త ప్రచారం చేయాలని తెలిపారు. కేంద్రం అందిస్తున్న లబ్దిని పొందుతూనే తిరిగి టిఆర్‌ఎస్ మంత్రులు, నాయకులు బిజెపిపై విమర్శలు చేస్తున్నారని వారి విమర్శలను తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాసులు, ఆచారి, నాగురావునామాజీ, పద్మజారెడ్డి, ప్రమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కసరత్తు వేగవంతం
* పలు శాఖల్లో ఉద్యోగుల పంపిణీ కేటాయింపులు పూర్తి * వనపర్తి, నాగర్‌కర్నూల్‌లో అధికారుల తిష్ట
* నేటితో ముగియనున్న అభ్యంతరాల పర్వం * వనపర్తిపై ఇప్పటికి 14,079 ఫిర్యాదులు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: జిల్లాలో విభజన ప్రక్రియ ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. అందుకుగాను అధికారులు విభజనపై ప్రత్యేక దృష్టిపెట్టి వివిధ శాఖల పరిధిలోని ఉద్యోగులను నూతనంగా ఏర్పాటు అయ్యే వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలతో పాటు ప్రస్తుతం ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ దాదాపు పలు శాఖల్లో పూర్తి అయ్యింది. అందులో బాగంగా వ్యవసాయశాఖలో మహబూబ్‌నగర్ జిల్లాకు 75, నాగర్‌కర్నూల్‌కు 26, వనపర్తికి 20 అధికారులను పంపిణీ చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసుశాఖలో వనపర్తికి 366, మహబూబ్‌నగర్‌కు 371, నాగర్‌కర్నూల్‌కు 364, వైద్య ఆరోగ్య శాఖలో నాగర్‌కర్నూల్ 40, మహబూబ్‌నగర్ 59, వనపర్తి 34, డివిజన్ మండల స్థాయి అధికారులను పంపిణీ ప్రక్రియ చేశారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ పరిపాలన విభాగంలో మహబూబ్‌నగర్‌కు 131, నాగర్‌కర్నూల్‌కు 46, వనపర్తికి 49, రహదారుల భవనాల శాఖలో నాగర్‌కర్నూల్ 34, వనపర్తి 37, మహబూబ్‌నగర్ 30 ఉద్యోగుల పంపిణీ కేటాయింపులు పూర్తి అయినట్లు సమాచారం. మొత్తం జిల్లాలో 3692 మంది పనిచేస్తుండగా అందులో మహబూబ్‌నగర్‌కు 1837, నాగర్‌కర్నూల్‌కు 940, వనపర్తికి 915 ఉద్యోగుల కేటాయింపు జరిగినట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరు నియోజకవర్గాలతో పాటు 25 మండలాలు ఉండబోతున్నాయి. ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలు నోడల్ కేంద్రాలుగా మారనున్నాయి. ఈ జిల్లాకు 2601 మంది ఉద్యోగులు అవరం ఉండగా ప్రస్తుతం ఉన్న వాటిలో 1837 మందిని కేటాయించారు. మిగితా వారిని జిల్లాల విభజన తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేసి తీసుకోనున్నారు. ప్రతిపాదిత వనపర్తి జిల్లాలో 21 మండలాలు, మూడు నియోజకవర్గాలు రాబోతున్నాయి. ఈ జిల్లాకు 1217 మంది ఉద్యోగులు అవసరమని తెల్చారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో 915 మందిని కేటాయిస్తున్నారు. మరో ప్రతిపాదిత నాగర్‌కర్నూల్ జిల్లాలో 21 మండలాలు, నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి. ఈ జిల్లాలో 1262 మంది ఉద్యోగులు అవసరమని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే 940 మంది ప్రస్తుతం విధులు నిర్వహిస్తారు. ఇది ఇలా ఉండగా జిల్లాలో ఓ పక్క గద్వాల, నారాయణపేట జిల్లాల కోసం ఉద్యమం కొనసాగుతుండగా మరోపక్క ప్రభుత్వం మాత్రం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తుంది. వనపర్తి, నాగర్‌కర్నూల్‌లో కార్యాలయాల ఏర్పాటుపై అధికారులు తిష్ట వేసి తమ పనిని చకచకగా చేసుకుంటున్నారు. ప్రభుత్వం ముసాయిదా వెలువరించి గత నెల 22 తేది నుండి ఈ నెల 21 వరకు అభ్యంతరాలకు గడువు విధించింది. ఇందులో భాగంగా మంగళవారం నాటికి జిల్లాలో 19194 పిర్యాధులు అందాయి. అందులో వనపర్తిపై 14079, నాగర్‌కర్నూల్ 2390, మహబూబ్‌నగర్ 2725 అభ్యంతరాలకు సంబందించిన ఫిర్యాదులు అందాయి. నేటితో తుది గడువు ఉండడంతో అభ్యంతరాలు చివరిరోజు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఏది ఎమైనప్పటికిని ప్రభుత్వం మాత్రం ఈ నెల 25వ తేది వరకు అంతా సిద్ద్ధం చేసుకుని ఈ నెల చివరి నుండే జిల్లా స్థాయి అధికారులు ప్రతిపాదిత జిల్లాతో పాటు నూతనంగా ఏర్పాటు అయ్యే మండలాల్లో పరిపాలనపై దృష్టి పెట్టి దసరా నాటికి అధికారికంగా పరిపాలన కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఆత్మకూర్‌లో పరిస్థితి ఉద్రిక్తతం
* జెఎసి నేతల ఆరెస్టు
ఆత్మకూర్, సెప్టెంబర్ 20: జిల్లాల పునర్ విభజనలో భాగంగా ఆమరచింత, ఆత్మకూర్, చిన్నచింతకుంట మండలాలను వనపర్తి జిల్లాలో కలపాలంటూ ఒక వర్గం, మహబూబ్‌నగర్ జిల్లాలో కలపాలంటూ మరోవర్గం చేపట్టిన ఆందోళనలో భాగంగా మంగళవారం ఆత్మకూర్ పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో జెఎసి నేతలను ఆరెస్టు చేశారు. ఆత్మకూర్‌కు చెందిన జెఎసి వర్గం పై మూడు మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ 48 గంటల బంద్‌కు పిలుపునివ్వడంతో మంగళవారం ఆమరచింతకు చెందిన జెఎసి వర్గం వనపర్తి జిల్లాలో కొనసాగించాలంటూ ఆమరచింత నుండి ఆత్మకూర్ మీదుగా వనపర్తి వరకు చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీని ఆత్మకూర్‌కు చెందిన జెఎసి వర్గం అడ్డుకునేందుకు ప్రయత్నించగా పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో గద్వాల డిఎస్పీ బాలకోటి ఆదేశాల మేరకు ఆత్మకూర్‌కు చెందిన జెఎసి నేతలను ఆరెస్టు చేసి చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమరచింతకు చెందిన జెఎసి నేతల ద్విచక్రవాహన ర్యాలీకి పోలీసులు అనుమతిని ఇవ్వడంతో ఆత్మకూర్ మీదుగా నినాదాలు చేసుకుంటూ వనపర్తికి తరలివెళ్లారు. ద్విచక్రవాహన ర్యాలీ వెళ్తుండగా ఆత్మకూర్‌కు చెందిన యువకులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు పెద్ద ఎత్తున రక్షణగా నిలిచి వాహన ర్యాలీని తరలించారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగించాలంటూ ఆత్మకూర్‌కు చెందిన ఎమ్మార్పి ఎస్ నాయకులు ఆత్మకూర్‌లోని సెల్ టవర్ ఎక్కి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సిఐ ప్రభాకర్‌రెడ్డి పోలీసు బలగాలతో సెల్ టవర్ చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసి నేతలను కిందికి దించారు. పై మూడు మండలాలను వనపర్తిలో కొనసాగించాలని ఒక వర్గం, మహబూబ్‌నగర్‌లో కొనసాగించాలని మరోకవర్గం గత నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళనలు ఆమరచింత, ఆత్మకూర్ పట్టణాల మధ్య వైశమ్యాలు రెచ్చగొట్టే విధంగా మారడంతో పలువురు విచారణ వ్యక్తం చేస్తున్నారు. ఆరెస్టు చేసిన జెఎసి నేతలను మధ్యాహ్నం 3 గంటలకు సొంత పూచికత్తుపై విడుదల చేసినట్లుగా సిఐ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు.

జిల్లా ఉద్యమ క్షేత్రంలోకి ప్రజావైద్యుడు
* డాక్టర్ మోహన్‌రావు ఆమరణ దీక్ష
గద్వాల, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో కొత్తజిల్లాల ఏర్పాటులో అన్ని అర్హతలు ఉన్న గద్వాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని నడిగడ్డ ప్రజలు భగ్గుమంటున్నారు. గత కొన్ని రోజులుగా గద్వాలను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు చేపడుతున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నుంచి గ్రామగ్రామాన అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో వ్యక్తం చేస్తూనే ఆమరణ దీక్షకు పూనుకుంటున్నారు. తాజాగా గద్వాల జిల్లా ఉద్యమక్షేత్రంలోకి ప్రజావైద్యులు తాముసైతం అంటూ ముందుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం గద్వాల పట్టణానికి చెందిన వైద్యుడు మోహన్‌రావు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు ఆయనకు పూలమాలలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ గద్వాల ప్రాంత అర్హతలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. గద్వాల జిల్లా నడిగడ్డ ప్రజల ఆత్మగౌరవ పోరాటం అని కొనియాడారు. గద్వాలను జిల్లా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెట్టడం నడిగడ్డ ప్రజలను ద్రోహం చేయడమేనన్నారు. ఈ సందర్భంగా జె ఎసి నేతలు మాట్లాడుతూ నెల్లూరు ప్రాంతానికి చెందిన ప్రజావైద్యుడు మోహన్‌రావు గత 20 సంవత్సరాలుగా గద్వాల పట్టణంలో ప్రజలు వైద్యసేవలు అందిస్తూ మన్ననలు పొందాడని కొనియాడారు. గద్వాల జిల్లా కోసం ఆయన ఆమరణ దీక్షకు పూనుకోవడం నడిగడ్డ ప్రజలందరికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్వాలను జిల్లాగా ప్రకటించి న్యాయం చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వీరభద్రప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూధన్‌బాబు, వెంకట్రాజారెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, మన్యం, ఇస్మాయిల్, మాల శ్రీనివాసులు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

నెల రోజుల్లో పెద్దమందడి, ఖిల్లా మండలాలకు
మిషన్ భగీరథ ద్వారా తాగునీరు
* ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
కొత్తకోట, సెప్టెంబర్20: మిషన్ భగీరథ ద్వారా నెల రోజుల్లో పెద్దమందడి, ఖిల్లాఘణపూర్ మండలాలకు తాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం కానాయపల్లి గుంపుగట్టు వద్ద నిర్మిస్తున్న వాటర్ గ్రీడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు శుద్ధ జలాలను వివిధ పథకాల ద్వారా అందిస్తున్నామని పెద్దమందడి, ఘణపూర్ మండలాలకు మిషన్ భగీరథ ద్వారా చేపడుతున్న పనులు పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు పూర్తయే దశలో ఉన్నాయన్నారు. గతంలో నిర్మించిన ట్యాంకులు కాకుండా కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. శంకర్ సముద్రం ద్వారా నీటి సరఫరా అవుతున్న హెడ్‌వర్క్ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని, ఇంటెక్‌వెల్ ట్రాన్స్‌ఫార్మర్, మోటార్లు అమర్చుతున్నారని అన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్, మోటార్ల కోసం టెండర్లను ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులు పిలిచారని ఇట్టి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. పనులు పూర్తి అయి గ్రామ గ్రామానా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వనపర్తి, గోపాల్‌పేట మండలాలకు మంచినీటి పథకంలో మిషన్ భగీరథ పనులు 30 నుండి 40 రోజుల్లో పూర్తవుతున్నట్లు తెలిపారు. అంతక ముందు గుంపుగట్టు సమీపంలోని వాటర్ గ్రీడ్ పనులతో పాటు శంకర్‌సముద్రం రింగ్ బండ్ వద్ద నిర్మిస్తున్న ఇంటెక్‌వెల్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, నేతలు లోక్‌నాథ్ రెడ్డి, వాకిటి శ్రీ్ధర్, కుమార్ బాబు, బుచ్చన్న, ఎ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో జాతీయ భావాన్ని
పెంపొందించాలి
* ఎబివిపి మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 20: దేశవ్యాప్తంగా విద్యార్థులో జాతీయ భావం పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎబివిపి మాజీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు. మంగళవారం ఎబివిపి జిల్లా అభ్యసవర్గలో ఆయన మాట్లాడుతూ ఎబివిపి జాతీయ భావంతో పని చేస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేసి ఉన్నత శిఖరాలను అవరోందించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. విద్యారంగ సమస్యలపై విద్యార్థులు ఉద్యమాలు చేసినప్పుడే కొన్ని హక్కులు సాధించుకుంటామని అన్నారు. దేశంలో ఉగ్రవాదుల దాడులు పాకిస్తాన్ పిరికిపందచర్య అని దేశంలోని విద్యార్థులంతా పాకిస్తాన్ చేస్తున్న అక్రుత్యాలపై మండిపడుతున్నారని అన్నారు. ప్రతి విద్యార్థిలో దేశ భక్తిని పెంపొందించేందకు ఎబివిపి జిల్లా శాఖ పని చేయాలని సూచించారు. జ్ఞానం, శీలం, ఎకత అనే సిద్ధ్దాంతంతో ముందుకెళ్లాని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంలో ఎబివిపి కీలకపాత్ర పోషిస్తోందన్నారు. సమావేశంలో యాదగిరి, అనిల్, రామచందర్, వెంకటేష్, బాలకృష్ణ, శివ, మహేష్, రాము, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.

అమర జవాన్లకు నివాళి
* జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ * పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు
ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 20: యూరిలో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన భారత జవాన్లకు మహబూబ్‌నగర్‌లో మంగళవారం నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్, పరదేశ్‌నాయడు చౌరస్తాలో సిటిజన్ రైట్ ఉమెన్‌రైట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వతుల ర్యాలీలో వన్‌టౌన్ సిఐ సీతయ్య హాజరై అమర జవాన్లకు ఘన నివాళి అర్పించారు. ర్యాలీలో వందలమంది పాల్గొన్ని పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ అమర జవాన్లకు స్మరించుకుని నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా సిఐ సీతయ్య మాట్లాడుతూ ఉగ్రవాదులు భారణ జవాన్లపై దాడి చేయడం పిరికిపంద చర్య అని ఆయన మండిపడ్డారు. ఉగ్రవాద సంస్థలను పెంచిపోసిస్తూ భారత్‌పై దాడులకు దిగుతున్న పాకిస్తాన్ ఎప్పుడోసారి తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాజీద్, వెంకట్, రఘు, ఆంజనేయులు, సలీం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సమష్టి భాగస్వామ్యంతోనే హరితహారం సక్సెస్
* జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి రక్షించాలి
* కలెక్టర్ శ్రీదేవి
కొత్తూరు, సెప్టెంబర్ 20: ప్రజలందరి భాగస్వామ్యంతోనే హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి అన్నారు.
మంగళవారం కొత్తూరు మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి బైపాస్‌పై నూతనంగా ఏర్పాటు చేస్తున్న హరితహారం గుంతలను పరిశీలించడంతో పాటు మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి రక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని, అందులో భాగంగా మొక్కలు నాటితే త్వరలోగా పెరిగే అవకాశాలు ఉంటాయని సూచించారు. జిల్లా ముఖద్వారం తిమ్మాపూర్ నుండి అలంపూర్ చౌరస్తా వరకు జాతీయ రహదారికి ఇరువైపుల మొక్కలు నాటి రక్షించే బాధ్యతను సంబంధిత శాఖ అధికారులు తీసుకోవాలని సూచించారు. కొత్తూరు మండలంలోని బైపాస్ రహదారికి ఇరువైపుల 2800గుంతలు తీయడం జరిగిందని, ప్రస్తుతం 300మొక్కలు నాటినట్లు వివరించారు. మిగితా 2500మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో జాతీయ రహదారికి ఇరువైపు పూర్తి స్థాయిలో మొక్కలు నాటి రక్షించేందుకు కంచెలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, అధికారులు కృషి చేయాలని అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా కంచె ఏర్పాటు చేసి రక్షించే బాధ్యతను ప్రతి వ్యక్తి తీసుకోవాలని సూచించారు. హరితహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రభుత్వ లక్ష్యం నేరవేర్చే విధంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిసిఇఓ లక్ష్మీనారాయణ, తహశీల్దార్ నాగయ్య, ఎంపిడివో జ్యోతితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అవయవదానం చేసి
మరణం తర్వాత కూడా జీవిద్దాం
* అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు
మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 20: అన్నదానం చేస్తే కొంత మంది ఆకలితీరుతుందని అక్షర ధానం చేస్తే అజ్ఞానం తీరుతుందని కానీ అవయవదానం చేస్తే ఎంతో మందికి పునర్ జన్మను ఇచ్చిన వారిమి అవుతామని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం జ్ఞాన విజ్ఞాన వేదిక ఆద్వర్యంలో ఆర్‌అండ్‌బి అతిథి గృహం నుండి మున్సిపల్ టౌన్ హల్ వరకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రతి ఏటా భారతదేశంలో కిడ్నీలు చెడిపోయి రెండు లక్షల మందికిపైగా లీవర్లు పాడై లక్షలాది మంది మరణిస్తున్నారని అలాంటి వారికి కావల్సిన అవయవాలను దానం చేసే దాతలు ముందుకు రాకపోవడంతో తమ విలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగిస్తున్నారని ఆయన పెర్కోన్నారు. అవయవదానం అనగానే రక్తదానంలా మనం బతికి ఉండగానే చేయాల్సిన అవసరం లేదని మరణించిన తర్వాత మన శరీరాన్ని వృధాగా మట్టిలో కలిపేసే బదులు శరీరంలో ఉండే అవయవాలను వేరొకరికి దానం చేస్తే వారికి జీవితాన్ని ప్రసాదించిన వారిమి అవుతామని ఆయన అన్నారు. మనిషి అవయవాలను దానం చేయడం వల్ల మరోకరి జీవితంలో బతికి ఉంటామని ఆ లెక్కన చూస్తే మరణించి కూడా జీరంజీవులుగా నిలుస్తామని ఆయన పెర్కోన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, సిఐలు సీతయ్య, రాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మోసగించిన కేసులో 8 మంది అరెస్టు
బొంరాస్‌పేట, సెప్టెంబర్ 20: మండల పరిధిలోని కొత్తూర్ గ్రామానికి చెందిన రాధమ్మను మోసగించిన కేసులో ప్రధాన నింధితులైన నజీర్‌తో పాటు మరో ఏడుగురిని నారాయణపేట డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, కొడంగల్ సిఐ శ్రీనివాస్‌రెడ్డిల ఆద్వర్యంలో ఆరెస్టు చేసినట్లు బొంరాస్‌పేట ఎస్సై హన్మప్ప తెలిపారు. నజీర్‌కు సహకరించిన బాబా, సాకలి రాజు, చంద్రశేఖర్‌గౌడ్, మునీర్‌మియా, అక్తర్‌బీ, ఖలీల్‌పాష, జాకీర్‌లను ఆరెస్టు చేసినట్లు ఎస్సై హన్మప్ప తెలిపారు.