మహబూబ్‌నగర్

ప్రజల ఆకాంక్షను విస్మరిస్తే పతనం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాల్లో అన్ని అర్హతలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలను జిల్లా చేయాలని నడిగడ్డలోని అలంపూర్, గద్వాల ప్రాంతంలో ప్రజలు అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల విభజన అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే డికె అరుణ మండిపడ్డారు. గద్వాలను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమాల్లో భాగంగా ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి ఎంపిపి సుభాన్ దీక్షను పోలీసులు భగ్నం చేసి బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో జెఎసి పిలుపు మేరకు మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి జై గద్వాల జిల్లా అంటూ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. డికె సత్యారెడ్డి బంగ్లా నుండి జెఎసి నేతలు, ఎమ్మెల్యే డికె అరుణ, కాంగ్రెస్ శ్రేణులు, మహిళా సంఘాలు, పట్టణ ప్రజలతో కలిసి కృష్ణవేణి చౌరస్తాలోని దీక్ష శిబిరానికి ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం దీక్షకు పూనుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతిని జెఎసి నేతలు, అన్నివర్గాల ప్రజలు, కౌన్సిలర్లు, మహిళలు సన్మానించారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త జిల్లాలు పరిపాలన సౌలభ్యం, ప్రజల ఆకాంక్ష, సౌకర్యార్థం జరగడం లేదని మండిపడ్డారు. కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, భజన పరులను సంతృప్తి పర్చడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కనుసన్నల్లో కొత్త జిల్లాలు ఏర్పాటు జరుగుతున్నాయన్నారు. గత 13 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నానని, ఇంతటి అహంకారి, అబద్ధపు మాటకారి అయన ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలకు సైతం సమయం కేటాయించకుండా దొర అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ఆమె విమర్శించారు. గద్వాల ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని వర్గాల ప్రజలు కలిసి సాగుతున్న జిల్లా ఉద్యమంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అరుణ మాత్రమే జిల్లా కావాలని కోరుతున్నారని, ప్రజలలో అలాంటి సెంటిమెంటు లేదని, ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చారని, అదేవిధంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని తిట్టడం జిల్లా రావడం లేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నడిగడ్డ ప్రజల ఆకాంక్ష, అర్హతలపై ఉద్యమ వేదిక దగ్గరకు వచ్చి చూడాలని సూచించడం తిట్టడమా? అని ప్రశ్నించారు. కొందరు నేతలు జిల్లాను అడ్డుకుంటున్న ఏక్‌నిరంజన్‌తో జతకట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం షేక్‌పల్లిలో మంత్రితో, అమరవాయి, మల్దకల్, బల్గెరలో నిరంజన్‌రెడ్డికి దండలు వేసి దండాలు పెట్టిన నేతలను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. జిల్లా కోసం ఎవరైనా ఉద్యమం చేస్తే నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా చేయాలని, మభ్యపెట్టే దొంగ ఉద్యమాలు వద్దని ఆమె హితవు పలికారు. జిల్లాను సాధించాలని ఉంటే నడిగడ్డ టిఆర్‌ఎస్ నేతలు సిఎం దగ్గరకు వెళ్లి ప్రజల ఆకాంక్షను తెలియజేయాలని, లేకుంటే చరిత్రలో ద్రోహులుగా మిగులుతారని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్, జెఎసి నేతలు వీరభద్రప్ప, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, గడ్డం కృష్ణారెడ్డి, ప్రకాష్‌గౌడ్, మధుసూదన్‌బాబు, నాగరాజు, భీంసేన్‌రావు, మోహన్‌రావు, బాలగోపాల్‌రెడ్డి, భీమన్న, బీజాపూర్ ఆనంద్, కుమ్మరి శ్రీను, ఎల్లప్ప, ఇంతియాజ్, డిటిడిసి నర్సింహా, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థి, కులసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.