క్రైమ్/లీగల్

ఓబులాపూర్‌లో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంగునూరు, మార్చి 23: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన నంగునూరు మండల ఒబులాపూర్ గ్రామంలో జరిగింది. రూరల్ సిఐ సైదులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహమ్మద్ అమిరలి 45, టీవిఎస్ సుజుకి ఏపి 10 ఎన్ 6288 నంబరు గల బైక్ పై స్నేహితుమైన బస్వరాజు రాజు 35 తో కలిసి పాలమాకులకు వెలుతున్న క్రమంలో రోడ్డు ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంకును గమనించక ట్యాంకరుకు ఢీకొట్టారు. దీంతో ఇరువురికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని 108లో సిద్దిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు రాజు భార్య సువర్ణ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సిఐ సైదులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి
నంగునూరు, మార్చి 23: బోరు మోటారు పైపులు దించుతుండగా ప్రమాద వశాత్తు పైనున్న విద్యుత్ వైర్లు పైపులకు తగిలి రైతు రాజయ్య మృతి చెందిన సంఘటన నంగునూరు మండలం మగ్దుంపూర్ గ్రామంలో శుక్రవారం నాడు జరిగింది. సాగు కోసం భూమిలో 5 బోర్లు వేయగా ఒక బోరులో నీరు వచ్చాయి. దీంతో వేసిన బోరులో పైపులు దించుతుండగా అకస్మాత్తుగా పైనున్న వైర్లు పైపుకు తగిలి విద్యుత్ షాక్‌కు గురి అయ్యాడు. అతని తోపాటు సహాయానికి వచ్చిన రైతులు పర్షయ్య, నర్సింహులుకు విద్యుత్ గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాజయ్యకు 5 ఎళ్లలోపు కూతుర్లు భవ్యశ్రీ, హారిక లున్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచు ప్రభాకర్‌రెడ్డి కోరారు.