క్రైమ్/లీగల్

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్చారం, ఏప్రిల్ 2: కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చిన్నఘనపూర్ గ్రామానికి చెందిన బిట్ల నాగభూషణం (46), వీరమణి (42) దంపతులకు ఇద్దరు కుమారులు. కాగా పెద్దకుమారుడు రాధాకృష్ణ మెదక్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు స్వతంత్రకుమార్ స్థానిక ఐఎంఎల్ డిపోలో హమాలీగా పని చేస్తున్నాడు. కాగా ఆదివారం ఉదయం చిన్నకుమారుడి భార్య నాగరాణి మామకు ఉదయం టిఫిన్ చేయడానికి ఇడ్లీ చేసి ఇచ్చింది. కొద్దిగా ఇడ్లీ తిని బాగాలేదంటూ ప్లేట్‌తో కోడలి ముఖంపై చల్లాడు. ఆమె వెంటనే తన భర్త కుమార్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చింది. అంతటితో ఊరుకోకుండా నాగభూషణం ఐఎంఎల్ డిపో వద్దకు వెళ్ళి చిన్నకుమారుడితో గొడవ పడ్డాడు. ఈ విషయాన్ని మెదక్‌లో ఉన్న తన అన్న రాధాకృష్ణకు ఫోన్‌లో సమాచారం ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరు కలిసి మెదక్‌కు వెళ్ళారు. ఆరోజు రాత్రి మెదక్‌లోనే ఉండగా ఇంటి వద్దే ఉన్న నాగభూషణం, వీరమణి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో వున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారు తలుపులు కొట్టడంతో వారు స్పందించకపోవడంతో తలుపులు పగులగొట్టి దంపతులిద్దరు మృతి చెంది ఉన్నారు. వెంటనే మెదక్‌లో ఉన్న కుమారులకు సమాచారం ఇచ్చారు. విషయాన్ని కొల్చారం పోలీసులకు సమాచారం ఇవ్వగా మెదక్ నుంచి సీఐ రామకృష్ణ, డీ ఎస్పీ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

నకిలీ విత్తనాలు విక్రయస్తే సహించేది లేదు: టాస్క్ఫోర్స్
గజ్వేల్, ఏప్రిల్ 2: నిషేధిత బీటీ-3 పత్తి విత్తనంతోపాటు నకిలీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు విక్రయిస్తే సహించేదిలేదని టాస్క్ఫోర్స్ ఏడీఏ శ్యాంసుందర్, అనీల్‌లు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని ఏడు ఫర్టిలైజర్‌షాప్‌లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పొట్టగొట్టే చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని, కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని స్పష్టం చేశారు. స్టాక్ రిజిస్టర్ సక్రమంగా మెంటేన్ చేయాలని, స్టాక్‌బోర్డుపై వివరాలు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. డీలర్లు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, అవకతవకలకు పాల్పడితే ఊరుకునేదిలేదని తెలిపారు. అయితే నిబందనలకు లోబడి వ్యాపారం నిర్వహించాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే పీడీయాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏవైనా సమస్యలుంటే రైతులు, అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ కమలాకర్, వ్యవసాయాధికారి ప్రవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.