ఆంధ్రప్రదేశ్‌

ఎపికి కేంద్ర మంత్రుల తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రధానిగా నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తాము సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు పలువురు కేంద్రమంత్రులు ఎపికి వస్తున్నారు. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు నగరాల్లో జరిగే బహిరంగ సభల్లో కేంద్రమంత్రులు పాల్గొంటారు. మోదీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అరుణ్ జైట్లీ, స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, ఉమాభారతి, ధర్మేంద్ర ప్రధాన్, మనోహర్ పారికర్ ఎపిలో పర్యటిస్తారు. వీరి పర్యటన ముగిశాక ఎపి నుంచి బిజెపి నేతల బృందం దిల్లీ వెళ్లి ప్రధానిని కలసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వివరిస్తారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, నిధుల కేటాయింపు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, హైకోర్టు ఏర్పాటు, ఎపి రాజధాని నిర్మాణం, విభజన సమస్యలు వంటి విషయాలను ప్రధాని దృష్టికి తీసుకువస్తారు.