రాష్ట్రీయం

ఏకగ్రీవం..సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి
సంగారెడ్డి , డిసెంబర్ 12: స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో శనివారం రిటర్నింగ్ అధికారి, జెసి వెంకట్రామ్‌రెడ్డి ధ్రువీకరణ పత్రాన్ని అభ్యర్థి భూపాల్‌రెడ్డికి అందజేశారు. శుక్రవారంనాడు కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకోవడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికారికంగా రిటర్నింగ్ అధికారి శనివారం ప్రకటించి ధృవీకరణ పత్రాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అనుభవం కలిగిన తనకు సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావులు గుర్తించి మరోసారి అవకాశం కల్పించడం పై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వంపై భారం పడకుండ ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి దన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారంతో పాటు బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు.