రాష్ట్రీయం

మేడారంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20వేల మరుగుదొడ్ల ఏర్పాటు
గోవిందరావుపేట, డిసెంబర్ 12: మేడారం సమ్మక్క -సారలమ్మ జాతరలో పారిశుద్ధ్యం పై అధికారులు ప్రత్యే క దృష్టి సారిస్తున్నారు. భక్తులకు మరింత మెరుగైన సైకర్యాలను కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్దితో పనిచేస్తున్నారు. ఇందులో భాగంగో గత మేడారం జాతరలో కంటే అధికంగా 20వేల వ్యక్తిగత మరుగుదొడ్లను మేడారం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం కోసమే సుమారు 12 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. 700శాశ్వత మరుగుదొడ్లు, 4వేల ఇనుప రేకుల మరుగుదొడ్లతో పాటు 15300 తాత్కలిక తడకల మరుగుదొడ్లను మేడారంలో ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే మేడారంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆవరణలో మోడల్ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు సైతం సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. కాగా ప్రతి మేడారం జాతరలో మరుగుదొడ్ల నిర్మాణాలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపధ్యంలో జిల్లా అధికారులు ఏ మేరకు నిధులను దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.