ఆంధ్రప్రదేశ్‌

పేదలకు సేవచేస్తా: మెడికల్ టాపర్ హేమలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పేదరికంలో పుట్టిన తాను పేద ప్రజలకు డాక్టర్‌గా సేవలందిస్తానని ఎపి ఎంసెట్ మెడికల్ విభాగంలో ఫస్ట్ ర్యాంకు సాధించిన హేమలత చెబుతోంది. చదువంటే తనకెంతో ఇష్టమని అందుకే కష్టపడి ఈ ర్యాంకును సాధించానని ఆమె అంటోంది. ఆమె తండ్రి వీరన్న కర్నూలులోని ఓ బట్టల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. తల్లి కళావతి గృహిణి. ఈ దంపతులకు ముగ్గురూ ఆడపిల్లలే. తన చదువుకోసం తల్లిదండ్రులు అప్పులు చేసి నానా కష్టాలు పడ్డారని, మెడిసిన్ చదివి వారిని ఆనందపరచడమే తన లక్ష్యం అని హేమలత తెలిపింది. తల్లిదండ్రుల కష్టానికి తగ్గట్టుగా తాను రేయింబవళ్లు దీక్షగా చదివానని చెబుతోంది. హేమలత అక్క సౌజన్య అగ్రికల్చరల్ బిఎస్సీ చదువుతుండగా, చెల్లెలు జయశ్రీ ఇటీవల మంచి మార్కులతో టెన్త్ పరీక్షలో పాసయ్యింది. గత ఏడాది తనకు ఎంసెట్‌లో 245వ ర్యాంకు వచ్చినా వయసు సరిపోనందున మెడిసిన్ సీటు రాలేదని, ఈ ఏడాది ఫస్ట్‌ర్యాంకు రావడం ఎంతో ఆనందం కలిగించిందని హేమలత తెలిపింది.