నమ్మండి! ఇది నిజం!!

శాకాహారమే బలవర్ధకం (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువారు ప్రధానంగా శాకాహారులే! అనాదిగా శాకాహారానికి తెలుగువారు ప్రాధాన్యత నిచ్చారు. అందుకు కారణం తెలుగు వారిలో అధిక సంఖ్యాకులు జైనులు గానీ, బౌద్ధులు గానీ కావటం ఒక కారణం అయితే, స్వతహాగానే వ్యావసాయిక కుటుంబాలు కావటం, మొక్కల పట్ల భక్త్భివం, ఆరోగ్య స్పృహ కలిగిన వారు కావటం కూడా శాకాహార ప్రయత్నానికి కారణాలే.
ఏ దేశంలోనైనా, ఏ యుగంలోనైనా, మనుషులు వౌలికంగా మాంసాహారులే! ప్రయత్నపూర్వకంగా కొద్దిమంది మాత్రమే శాకాహారులయ్యారు. చిలుకల్లాంటి పక్షులు, ఏనుగు, ఎద్దు, గుర్రం లాంటి బలిష్ఠమైన జంతువులు వౌలికంగా శాకాహారులు. గద్దల్లాంటి పక్షులు, సింహం లాంటి జంతువులు వౌలికంగా మాంసాహారులు. వీటిని ప్రయత్నపూర్వకంగా శాకాహారులుగా మార్చి, గడ్డి గాదం తినమంటే సాధ్యపడే విషయం కాదు.
శాకాహారిగా మనిషి మారిన ఆ ప్రయత్నం జీవకారుణ్యం అనే ఒకే ఒక ఆదర్శం కోసం, లక్ష్యం కోసం, ఒక ప్రధానమైన జీవన విధానం కోసమే జరిగింది. సింహమో, పులో, ఎలుగుగొడ్డో ఆదర్శం కోసం శాకాహారులు కావటం అసాధ్యం. అలాగని, మనుషుల్ని శాకాహారులు, మాంసాహారులు అని రెండు రకాలుగా వర్గీకరించటం కూడా కష్టమే! శాకాహారులుగా జీవించే మాంసాహారులూ, మాంసాహారం కూడా తీసుకోగలిగిన శాకాహారులు, చాలామంది ఉన్నారు కాబట్టి.
విచిత్రం ఏమంటే, విందు భోజనాలప్పుడు గమనించి చూడండి.. మాంసాహారుల కోసం 400 సీట్లు వేస్తే, శాకాహారుల కోసం 100 సీట్లు కూడా ఉండవు. మాంసాహారం దగ్గర తాకిడి ఎక్కువగా ఉంటుంది గానీ ఇంటి భోజనంలో మాత్రం శాకాహారమే ఎక్కువ వినియోగంలో ఉంటుంది.
సింధు నగరాలలో దొరికిన ఒక ముద్రికపైన జంతు సమూహం మధ్య కూర్చున్న శిశ్న దేవుడు లేదా పశుపతి బొమ్మ కనిపిస్తుంది. ఆనాటి మానవుల జీవకారుణ్యం, జంతు ప్రేమలకు ఈ ముద్రిక ప్రబల సాక్షి. ఇదే కాలానికి చెందిన ఇతర దేశీయుల నాగరికతల్లో ఎద్దుతో పోరాటం లాంటి బొమ్మలు కనిపిస్తాయి. భారతీయ నాగరికతలోని ప్రత్యేకతని దీనివలన మనం అర్థం చేసుకోవచ్చు.
ఆధునికంగా మాంసం కూర కొంచెం తిని, తక్కిన భోజనం అంతా శాకాహారంతో ముగించటాన్ని మెడిటరేనియన్ భోజనం అంటారు. భారతీయులు, మీదు మిక్కిలిగా తెలుగు వారి ఆది నుండీ ఇదే తరహా భోజనం చేస్తున్న సంగతిని విస్మరించటం ప్రపంచ ఆహార చరిత్రకారులకు తగని పని! అది ఇండియన్ తరహా భోజన విధానం. మనల్ని చూశాకే మెడిటరేనియన్లు అలాంటి శాకమాంస మిశ్రీత ఆహారానికి అలవాటు పడ్డారు.
కేవలం మాంసం మాత్రమే తిని ఆనాటి మానవుడు బ్రతికినట్టయితే, కూరగాయలు, ధాన్యాల ఉత్పత్తి అంత విస్తృతంగా జరిగి ఉండేది కాదు. కొత్త కూరగాయల కోసం అనే్వషణ కూడా జరిగి ఉండేది కాదు. కల్పవృక్షం కోసం అంతగా సముద్ర మథనమో లేక సముద్రయానమో చేయవలసి వచ్చేదీ కాదు.
వేదయుగంలో కూడా మాంసాహారాన్ని పండగలకో, శుభకార్యాలకో, కుటుంబ పరమైన కార్యక్రమాలకో పరిమితంగా వాడేవారే గానీ రోజూ తిని తీరాలన్నట్టు తినేవారు కాదని పద్మినీ సేన్ గుప్తా (ఉ్పళూకజ్ఘూక జచిళ జశ ఘశషజళశఆ నిశజూజ్ఘ జనచ్యిజూ శ్రీశజ్పళూఒజఆక -ళఒఒ) పేర్కొన్నారు. మను ధర్మశాస్త్రం కూడా మాంసాన్ని అప్పుడప్పుడూ, ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని మాత్రమే తినవలసిన అంశంగా చెప్పింది.
మాంసాన్ని పవిత్ర జలం చల్లి సంబంధిత మంత్రాలు చదివి వండుకోవాలని కూడా ధర్మశాస్త్రాలు చెప్పాయి. పరమేశ్వరుడు సృష్టించిన ఈ జీవరాసుల్లో దేన్నీ చంపే హక్కు ఎవరికీ లేదనీ, ఒకవేళ ఆకలి కోసం చంపినా అది ధర్మబద్ధంగా ఉండాలనీ, మనుధర్మ శాస్త్రం పేర్కొంది.
ఒకప్పుడు అశోకుని వంటశాలలో వందలు, వేలు జంతువులను ప్రతిరోజు మాంసం కోసం చంపేవారు. అశోకుడు బౌద్ధుడిగా మారిన తరువాత రెండు నెమళ్లు, ఒక జింకని మాత్రమే చంపేవారు. ఆ తర్వాత జింకను కూడా ఏదో ప్రత్యేక సందర్భంలో తప్ప రోజూ చంపి వండటం మానేశారు. ఇంకొన్నాళ్లకు ఆ రెండు నెమళ్లను కూడా చంపటం మానేసి, అశోకుడు కేవలం శాకాహారిగా మారాడు - అని ఒక శాసనంలో ఉంది. 38 ఏళ్లపాటు అశోకుడు రాజ్యపాలన చేశాడు. అందులో కనీసం 27 ఏళ్లు శాకాహారిగా పాలించాడు.
కృష్ణా గోదావరీ మధ్యప్రదేశంలో గేదెలకు కూడా ప్రాధాన్యత ఉండేది. మాహిష మండలంగా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. దీనే్న గ్రీకులు మైసోలొస్ అని ఉచ్చరించేవారు.
సింధూ తవ్వకాలలో దొరికిన పెద్ద మూపురం కలిగిన ఎద్దు ఆకారంలో ఉన్న ఒక శిల్పం అమరావతి త్రవ్వకాలలో కూడా దొరకటాన్నిబట్టి, గేదెలతోపాటు ఆవులకూ తెలుగు నేల సమాదరానే్న ఇచ్చిందని అర్థం అవుతోంది. ఆవులూ, ఎద్దులూ, గుర్రాల్లాంటి కాయకష్టం చేసే జంతువుల మాంసం అజీర్తి కలిగిస్తుందనీ, జీర్ణకోశాన్ని పాడు చేస్తుందనీ వైద్యశాస్త్రం హెచ్చరించగా, ఆవుకున్న దివ్యత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గో మాంస భక్షణాన్ని మన పూర్వులు నిషేధించుకున్నారు.
బౌద్ధుల కాలంలో వరి బియ్యంతో వండిన అన్నానికి ప్రాధాన్యత పెరిగింది. మత, సాంస్కృతిక, వాణిజ్యపరమైన కారణాల వలన, తెలుగు వారికీ, వైదిక ఆర్యులకూ మధ్య కూడా రాకపోకలు, సాన్నిహిత్యం పెరిగాయి. దక్షిణాదిలో గోధుమని, ఉత్తరాదిలో వరినీ పండించటం, తినటం అలవాటు అయ్యేందుకు ఇది కారణం అయ్యింది. కొమ్ములు లేని జంతువుల మాంసాన్ని తినటానికి ఆ కాలంలో బ్రాహ్మణులకు అనుమతి ఉండేది.
వ్యవసాయంపైన ఆధారపడిన నేల కావటం వలన, జైన బౌద్ధాల ప్రభావం తెలుగు నేల మీద అధికంగా ఉండటం వలన, తెలుగు ప్రజలు స్వతహాగా శాకాహార ప్రియులే కావటాన తెలుగువారి ఆహార చరిత్ర శాకాహార మయంగా కనిపిస్తుంది.
మాంసాహారం వీరికి తెలియక కాదు. నా పరిశీలనలో చేపలకు 400 రకాల తెలుగు పేర్లు కనిపించాయి. కాబట్టి, మాంసాహార ప్రియత్వం తెలుగు వారికి లేదని ఎవరూ అనలేరు.
కానీ, తెలుగు ప్రజలు తరతరాలుగా శాకాహార వంటకాల మీద చేసిన ప్రయోగాలతో పోల్చినప్పుడు మాంసాహార వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత నీయలేదనిపిస్తుంది.
ఇది తెలుగువారి ఆహార చరిత్రలో కీలక అంశం. మాంసం తినటం ఒక అవసరం గానీ, ఒక వ్యామోహం గానీ, ఒక నాగరికతా చిహ్నం గానీ కానేకాదు.
పండించే తీరు ఆరోగ్యదాయకంగా ఉంటే మాంసంకన్నా కూరగాయలే ఎక్కువ బలకరం అవుతాయి.
*

మీకు మీరే డాక్టర్

- డా. జి.వి.పూర్ణచందు
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్
సత్యం టవర్స్, 1వ అంతస్తు,
బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు
గవర్నర్‌పేట, విజయవాడ - 500 002
సెల్ : 9440172642
purnachandgv@gmail.com

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com