మీకు మీరే డాక్టర్

ఫురుగుమందులతో ‘ఆటిజం’?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: ఆకు కూరలు ఎక్కువగానూ, అన్నం తక్కువగానూ తినాలని మీరు రాస్తున్నారు. ఆకు కూరలు, కాయ గూరలు నిండా పురుగు మందులే ఉంటున్నాయి. ఏ కూర వండినా డిడిటి వాసన వేస్తోంది. దీనివల్ల కలిగే నష్టాల గురించి కూడా తెలియజెప్పండి సార్. విచక్షణా రహితంగా పురుగు మందులను, రసాయనిక ఎరువులను వాడనీకుండా ప్రభుత్వానికి అర్థమయ్యేలా వ్రాయండి సార్.
-లక్ష్మణరావు వై. విశాఖపట్టణం
జ: పురుగు మందుల్ని పురుగుల్ని చంపటం కోసం చల్లుతున్నారా..? లేక మనుషుల్ని చంపటం కోసం చల్లుతున్నారా? అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది. అవును.. ఆందోళనకరమైన రీతిలోనే ఆహార ద్రవ్యాల ఉత్పత్తి జరుగుతోంది.
ఆధిక ఉత్పత్తి కోసం చేసే ప్రయత్నాలు వినియోగదారునిపైన దుష్ప్రభావం కలిగిస్తాయని ఎవరూ సంకోచించటం లేదు. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి బలంగా నిషేధించటం లేదు. మొక్కలకు, పశువులకు ఇంజెక్షన్లు చేయటం, కార్బయిడ్ వేసి పండ్లను మాగేలా చేయడం, నేలలో సారం పెంపు గురించి ప్రయత్నించకుండా ఎరువులు తెచ్చి గుమ్మరించటం, ఆకు కూరలతో సహా పంట చేలన్నింటినీ పురుగు మందులతో ముంచెత్తటం.. అడిగేవారు లేని స్థితిలో ఇష్టారాజ్యంగా సాగుతోంది.
అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ ఇటీవల ప్రచురించిన ఒక నివేదికలో మనం విస్తుపోయే ఒక నిజాన్ని చెప్పింది. పిల్లల పాలిట ‘పూతన’ అనదగిన భయంకర మానసిక వ్యాధి ‘ఆటిజం’ అనేది కలగటానికి గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి రక్తంలో పురుగుమందుల శాతం ఎక్కువగా ఉండటం ఒక కారణంగా ఈ నివేదిక చెప్తోంది. తల్లి రక్తంలో పురుగుమందు ఎక్కడిది? ఆమె తిన్న ఆహార పదార్థాల ద్వారానే చేరింది.
అదే పనిగా ఏడవటం, స్తబ్దుగా ఉండటం, దగ్గరకు తీసుకుంటే స్పందించకపోవటం, తోటి పిల్లలతో కలవకపోవటం, పిలిస్తే పలకకపోవటం, ఒంటరితనం, మునివేళ్ల మీద నడవటం, మాటలు ఆలస్యం కావటం, అడిగినవి ఇవ్వకపోతే ఉద్రేకపడటం, చిన్నదానికే భయపడటం, అతి చురుకుదనాన్ని ప్రదర్శించటం, మెదడు, నాడీ సంబంధ సమస్యలూ, మానసిక ఎదుగుదల లోపం లాంటి లక్షణాలు ఆటిజం వ్యాధి వచ్చిన పిల్లల్లో కనిపిస్తాయి. అమెరికాలో ప్రతి 60 మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం వస్తోందని శాస్తవ్రేత్తలు చెప్తున్నారు.
ఇంతకు మునుపు మనకు అంతగా తెలియని వ్యాధి ఇది. విదేశాలకే పరిమితం అనుకున్న ఈ వ్యాధి ఇప్పుడు తెలుగు ప్రాంతాల్లో కూడా కనిపిస్తోండటం ఆందోళన కలిగించే విషయమే! ఇంతవరకూ ఈ వ్యాధికి స్పష్టమైన కారణాలను కనుక్కోలేదు. అందువలన చికిత్స కూడా నిర్ధారితంగా లేదు. సానుకూల ఎదుగుదలకు సంబంధించిన శిక్షణ ఇవ్వటమే చేయగలుగుతున్నారు.
పురుగు మందులు ఎక్కువగా చల్లిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు, ఇతర ధాన్యాలను తీసుకోవటం వలన మనిషి రక్తంలో ఆ పురుగు మందుల అవశేషాలు పెరిగిపోతున్నాయి. గర్భవతి రక్తంలో పురుగుమందులు ఎక్కువగా ఉంటే, అది పుట్టే బిడ్డను చేరి ఈ ఆటిజం లాంటి సమస్యలకు కారణం అవుతోందని ఈ పరిశోధన సారాంశం.
న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మైల్‌మాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు ఈ పరిశోధన చేశారు. ప్రధానంగా డిడిటి మీద ఈ పరిశోధకులు ఎక్కువగా దృష్టి పెట్టారు. పిల్లల ప్రవర్తనలో స్తబ్దత, మార్పులకు అనుగుణంగా స్పందించకపోవటం, అసామాజికంగా ఎదగటం ఈ లక్షణాలకు జష్ద్య్యూ జూజఔ్దళశక ఆజష్ద్య్యూళఆ్ద్ఘశళ (డిడిటి) అనే పురుగుమందు కారణం అవుతోందని ఈ పరిశోధనలో తేలింది.
డిడిటిని 1874లో క్రిమిసంహారక ఔషధంగా కనిపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో యూరోప్‌లోనూ, దక్షిణ పసిఫిక్ ప్రాంతాల్లోనూ ప్రబలిన టైఫాయిడ్ సూక్ష్మజీవుల్ని సంహరించటానికి దీన్ని ఔషధంగా వాడారు. తరువాతి కాలంలో డిడిటి అనేది మొక్కలకు పట్టే తెగుళ్ల మీద పనిచేసే ఔషధంగా భారీ వినియోగంలోకి వచ్చింది. దీని వలన కలిగే దుష్పరిణామాలను గుర్తించి, 1972లో అమెరికాలో పురుగు మందుగా దీని వాడకాన్ని నిషేధించారు.
ఇప్పటికిప్పుడు డిడిటిని నిషేధించినా ఒరిగేదేమీ లేదని, ఇన్నాళ్లు వాడిన ఫలితంగా అది మొక్కల్లో అణువణువునా విస్తరించి ఉన్నదనీ, కనీసం అనేక దశాబ్దాలపాటు దాని దుష్ప్రభావం కొనసాగుతుందనీ శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు.

(మిగతా వచ్చే సంచికలో)

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com